తెలంగాణా రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నారు. పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో ఒక్కసారిగా బీరు అమ్మకాలు పెరిగిపోయాయి. పెరిగిపోతున్న ఉష్ణతాపానికి చిల్డ్ బీరును తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి నిదర్శనమే గత పది రోజుల్లో బీర్ల అమ్మకాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.
తెలంగాణ రాష్ట్ర అబ్కారీ శాఖ అధికారుల వెల్లడించిన వివరాల మేరకు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 10వ తేదీ వరకు బీర్ల అమ్మకాల్లో భారీ పెరుగుదల కనిపించినట్టు తెలిపారు. గత యేడాదితో పోల్చితే ఈ పది రోజుల్లోనే ఏకంగా 20 శాతం మేరకు అమ్మకాలు పెరిగినట్టు చెప్పారు. కేవలం 10 రోజుల్లో 10 లక్షల బీరు కేసులు అమ్ముడుపోయాయని తెలిపారు. గత యేడాది ఇదే సమయంలో 8.3 లక్షల బీర్ల అమ్మకాలు పెరిగినట్టు పేర్కొన్నారు.
అదేసమయంలో ఇతర రకాల మద్యం అమ్మకాల్లో స్వల్పంగా తగ్గుదల నమోదైంది. 2021 ఏప్రిల్ మొదటి పది రోజుల్లో 6 లక్షల కేసులుగా ఉన్న మద్యం అమ్మకాలు ఈ ఏడాది 13 శాతం తగ్గి 5.14 లక్షల కేసులుగా నమోదైనట్టు అధికారులు తెలిపారు.