Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సీఎం జగన్ 2.0 : కొత్త జట్టు ఇదే.. శాఖల కేటాయింపు

new cabinet
, మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (08:13 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గాన్ని పునర్‌వ్యవస్థీకరించారు. పాత మంత్రి వర్గం నుంచి 14 మందిని తప్చించి కొత్తగా 14 మందిని చేర్చుకున్నారు. అలాగే, పాత మంత్రివర్గంలోని 11 మందికి రెండోసారి మంత్రులుగా అవకాశం కల్పించారు. సీఎం జగన్ 2.Oగా పేర్కొనే 25 మంత్రులతో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయించారు. 
 
ఆ తర్వాత మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి సీఎం జగన్ శాఖలను కేటాయించారు. కొత్త మంత్రివర్గంలోనూ ఐదుగురు మంత్రులకు ఉప ముఖ్యమంత్రి హోదా కల్పించారు. వీరిలో రాజన్నదొర, బుూడి ముత్యాల నాయుడు, కొట్టు సత్యనారాయణ, కె నారాయణ స్వామి, అంజాద్ బాషాలు ఉన్నారు. కాగా, ఈ కొత్త మంత్రులు, వారికి కేటాయించిన శాఖల వివరాలను పరిశీలిస్తే, 
 
వైఎస్. జగన్మోహన్ రెడ్డి - ముఖ్యమంత్రి, మంత్రులకు కేటాయించని శాఖలు
1. ధర్మాన ప్రసాద రావు (బీసీ) - రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంపులు
2. సీదిరి అప్పలరాజు (బీసీ) - పశుసంవర్ధక, మత్స్య, మరియు పాడిపరిశ్రమ అభివృద్ధి
3. బొత్స సత్యనారాయణ (బీసీ) - విద్య
4. గుడివాడ అమర్‌నాథ్ (ఓసీ) - పరిశ్రమలు, పెట్టుబడి, వాణిజ్యం మరియు సమాచార సాంకేతికత
5. పీడిక రాజన్న దొర (ఎస్టీ) - ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమం 
6. బూడి ముత్యాల నాయుడు (బీసీ), ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయత్ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఇన్‌ఛార్జ్.
7. పినిపే విశ్వరూప్ (ఎస్సీ) - రవాణా
8. దాడిశెట్టి రామలింగేశ్వరరావు (ఓసీ) - రోడ్లు మరియు భవనాలు
9. సీహెచ్. వేణుగోపాలకృష్ణ (బీసీ) - బీసీ సంక్షేమం, ఐ అండ్, పీఆర్, సినిమాటోగ్రఫీ
10. తానేటి వనిత (ఎస్పీ) - గృహ మరియు విపత్తు నిర్వహణ
11. కరమూరి వీఎస్ నాగేశ్వరరావు (బీ) - పౌర సరఫరాలు
12. కొట్టు సత్యనారాయణ (ఓసీ) - ఉప ముఖ్యమంత్రి మరియు దేవాదాయ శాఖ
13. జోగి రమేష్ (బిసి) - హౌసింగ్
14. అంబటి రాంబాబు (ఓసీ) - నీటి వనరులు మరియు నీటిపారుదల
15. మెరుగు నాగార్జున (ఎస్సీ) - సాంఘిక సంక్షేమం
16. విడదల రజిని (బీసీ) - వైద్య విద్య, ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం
17.  కాకాని గోవర్ధన్ రెడ్డి (ఓసీ)- వ్యవసాయం, మార్కెటింగ్ మరియు సహకారం
18. అమ్జాద్ బాషా షేక్ బేపారి (మైనారిటీ), ఉపముఖ్యమంత్రి మరియు మైనారిటీ సంక్షేమ శాఖ ఇన్‌ఛార్జ్.
19. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (ఓసీ) - ఫైనాన్స్ అండ్ ప్లానింగ్, కమర్షియల్ టాక్సేషన్, స్కిల్ డెవలప్‌మెంట్, అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్
20. గుమ్మనూరు జయరామ్ (బీసీ) - కార్మిక సంక్షేమం, ఉపాధి
21. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (ఓసీ)- పవర్, ఫారెస్ట్రీ, మైనింగ్ అండ్ జియాలజీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ
22. కె. నారాయణ స్వామి (ఎస్సీ)- ఉప ముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్ మంత్రి
23. ఆర్కే.రోజా (ఓసీ)- టూరిజం, కల్చర్ మరియు యూత్ అడ్వాన్స్‌మెంట్
24. కెవి ఉషశ్రీ చరణ్ (బిసి)- స్త్రీ, శిశు సంక్షేమం
25. ఆదిమూలపు సురేష్ (ఎస్సీ) - మున్సిపల్ అండ్ టౌన్ ప్లానింగ్. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్ అంతా ఒక్కటే.. ఉత్తరాది - దక్షిణాది అనే తేడా ఉండదు : ఏఆర్ రెహ్మాన్