కన్నడ స్టార్ కె.జి.ఎఫ్. కథానాయకుడు యష్ తెలుగు రాష్ట్రంలో పర్యటించారు. తిరుపతి, విశాఖపట్నం, హైదరాబాద్ పట్టణాలల్లో చిత్ర యూనిట్ పర్యటిస్తోంది. సోమవారం మధ్యాహ్నం వైజాగ్ సింహాద్రి అప్పన్నగా పిలిచే వరాహ లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉన్నాడు ఆయన దేవాలయంలో ఆశీస్సులు కోరుతున్నారు. ధ్వజస్తంబానికి మొక్కి ఆయన కోరికలు కోరుకున్నారు. పూజారులు ఆయనకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆయన వైజాగ్‌లో ప్రేక్షకులనుద్దేశించి మాట్లాడుతూ, కెజి.ఎఫ్. అనేది తల్లి కొడుకుల సెంటిమెంట్‌తో కూడిన కథ. మొదటి పార్ట్ కంటే కెజి.ఎఫ్.2 చాప్టర్‌లో మరింతగా సెంటిమెంట్ వుంటుంది.
అంతేకాకుండా యాక్షన్ అందరినీ ఆకట్టుకుంటాయి. గోల్డ్ మైన్‌లో జరిగిన ఓ సంఘటన ఆధారంగా కథను రూపొందించారు. ప్రశాంత్ నీల్ అద్భుతంగా దర్శక్తం వహించారు అని తెలిపారు. హోంబలే ఫిలింస్ పతాకంపై రూపొందిన ఈ సినిమాలో సంజయ్‌దత్ పాత్ర హైలైట్ కానుంది. యష్, సంజయ్ దత్ పాత్రలు ఒకరినిమించి ఒకరుగా నటించారని తెలుస్తోంది. ఇటీవలే బెంగుళూరులో ఈ విషయమై ప్రస్తావిస్తూ, విలన్ సరైనవాడువుంటేనే హీరోకు అంత పేరు వస్తుందని సంజయ్ నుంచి నటుడిగా చాలా నేర్చుకున్నానని తెలిపారు. ఏప్రిల్ 14న విడుదలవుతుంది.