Webdunia - Bharat's app for daily news and videos

Install App

#HBDManOfMassesYSJagan : నగరి ఎమ్మెల్యే ఆర్కే.రోజా స్పెషల్ గిఫ్ట్ ఇదే...

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (08:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ 21వ తేదీన పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు. దీన్ని పురస్కరించుకుని ఆ పార్టీకి చెందిన చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే.రోజా ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, మా ఆరాధ్య నేత జగనన్న పుట్టిన రోజును పురస్కరించుకుని తన నియోజకవర్గంలోని మీరా సాహెబ్ పల్లె అనే గ్రామాన్ని దత్తత తీసుకుంటున్న ప్రకటించారు. ఈ గ్రామంలో ఒక్కరంటే ఒక్కరు కూడా చదువుకోలేదని గుర్తుచేశారు. 
 
ఈ గ్రామంలోని కుటుంబాలు ప్రతి రోజూ కాయకష్టం చేస్తేగానీ వారి కుటుంబ పోషణ గడవదన్నారు. అందుకే ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని వచ్చే యేడాది జగనన్న పుట్టిన రోజు నాటికి ఈ గ్రామం రూపురేఖలు మార్చాలని నిర్ణయించినట్టు తెలిపారు. 
 
అదేవిధంగా ఈ కోవిడ్ సమయంలో తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి నూతన వస్త్రాలతో పాటు.. వివిధ రకాలైన సామాగ్రిని అందజేస్తానని తెలిపారు.
 
కాగా, గత పుట్టినరోజుకు పుష్ప అనే అనాథ అమ్మాయిని దత్తత తీసుకున్న రోజా.. ఆ యువతి కోరిక మేరకు డాక్టర్‌గా చదివించాలని నిర్ణయించింది. ఇటీవల వెల్లడైన నీట్ పరీక్షల్లో ఆ యువతి ఉత్తీర్ణత సాధించింది. అలాగే, ఈ పుట్టిన రోజుకు ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments