Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాయ్‌ఫ్రెండ్‌ను ఆట పట్టించింది... సూట్‌కేసులో వుంచి తాళం వేసింది.. చివరికి?

Webdunia
శుక్రవారం, 28 ఫిబ్రవరి 2020 (12:07 IST)
ఫ్లోరిడా నగరంలో ఓ మహిళ కటకటాలపాలైంది. తన బాయ్‌ఫ్రెండ్‌ను ఆట పట్టిద్దామనుకున్న ఓ మహిళకు ఈ పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే.. సారా బూన్‌ అనే మహిళ తన బాయ్‌ఫ్రెండ్‌ జార్జ్ టోర్రెస్ జూనియర్‌తో కలిసి ఫ్లోరిడా నగరంలో నివసిస్తున్నారు. గత సోమవారం ఇంట్లోనే ఉన్న వీరిద్దరు సరదాగా మద్యం సేవించారు. అనంతరం హైడ్‌ అండ్‌ సీక్‌ పేరుతో సారా బూన్‌ తన బాయ్‌ఫ్రెండ్‌ జార్జ్‌ను సూట్‌కేసులో పెట్టి జిప్‌కు తాళం వేసింది.
 
ఈ సూట్‌కేసులో ఎక్కువ సేపు వుండలేనని.. ప్లీజ్ తనను బయటికి రానివ్వమని జార్జ్ ఎంత  వేడుకున్నా బూన్ పట్టించుకోకుండా తన గదిలోకి వెళ్లిపోయింది. దీంతో రాత్రంతా సూట్‌కేసులోనే ఉండిపోవడంతో జార్జ్‌ ఊపిరాడక చనిపోయాడు. మరుసటి రోజు బూన్‌ కిందకు వచ్చి సూట్‌కేస్‌ తెరిచి చూడడంతో జార్జ్‌ అప్పటికే మృతి చెందడంతో ఆమె షాక్‌కు గురైంది. దీంతో బూన్‌ పోలీసులకు ఫోన్‌ చేయడంతో వెంటనే ఘటనా స్థలికి చేరుకొని బూన్‌ను కస్టడీలోకి తీసుకున్నారు.
 
మద్యం తాగిన అనంతరం సరదాగా ఉంటుందని హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుదామని జార్జ్‌ను అడిగానని తెలిపింది. అందుకు జార్జ్‌ ఒప్పుకోవడంతో అతన్ని సూట్‌కేసులో ఉంచి దానికి తాళం వేసి తన గదికి వెళ్ళిపోయానని.. తనకు ఊపిరి ఆడట్లేదని.. బయటికి తీయాలని జార్జ్‌ వేడుకున్నా.. మద్యం మత్తులో తాను పట్టించుకోలేదని.. పోలీసులకు వివరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments