Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరిన కంటిదీపాలు, ఇంట్లోని వంటింటి గోడ కూలి ముగ్గురు చిన్నారులు మృతి

Webdunia
శుక్రవారం, 28 ఫిబ్రవరి 2020 (11:48 IST)
ఆ ఇంటి కంటి దీపాలు ఆరిపోయాయి. హైదరాబాద్ మాంగార్ బస్తీలో నివాసముండే చిత్తు కాగితాలు ఏరుకుని జీవించే మీఠాలాల్, గబ్బర్‌లనే అన్నదమ్ములు తమ కుటుంబాలతో ఒకే ఇంట్లో నివాసముంటున్నారు. రాత్రి అన్నం తిన్నాక పిల్లలు ఇంట్లో నిద్రిస్తుండగా.. పెద్దలు ఇంటి ముందు కూర్చొని ఉన్నారు. వంటింటి గోడ ఫెళ్లుమంటూ ఒక్కసారిగా కుప్పకూలింది. 
 
ఈ ప్రమాదంలో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న మీఠాలాల్ ముగ్గురు కుమార్తెలు ఆరేళ్ల రోష్ని, మూడేళ్ల సారిక, రెండు నెలల వయస్సున్న పావని అక్కడికక్కడే చనిపోగా.. గబ్బర్ కుమార్ మూడేళ్ల గీత తీవ్ర గాయాలపాలైంది. గోడ కింద శిథిలాల్లో చిక్కుకున్న ముగ్గురు చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ మూడేళ్ల గీతకు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments