Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రపంచ శతాధిక వృద్ధుడు ఇకలేరు... విచారం వ్యక్తం చేసిన గిన్నిస్ బుక్ ప్రతినిధులు

ప్రపంచ శతాధిక వృద్ధుడు ఇకలేరు... విచారం వ్యక్తం చేసిన గిన్నిస్ బుక్ ప్రతినిధులు
, మంగళవారం, 25 ఫిబ్రవరి 2020 (16:47 IST)
ప్రపంచ శతాధిక వృద్ధుడు
ఈరోజుల్లో పట్టుమని 50 ఏళ్లు దాటితే చాలు... ఏవో అనారోగ్యాలు చుట్టుముట్టి ప్రాణాలు తీసేస్తున్నాయి. అలాంటిది ఏకంగా 100 ఏళ్లు దాటేసి 112 ఏళ్ల పాటు హుషారుగా జీవనం సాగిస్తూ గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కారు ప్రపంచ శతాధిక వృద్ధుడు చిటెట్సు వటనాబె. ఆయన ఆదివారం నాడు అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఈయన జపాన్‌కు చెందిన వ్యక్తి. 
 
చిటెట్సు వటనాబె గత కొన్ని రోజులగా జ్వరం, శ్వాసంబంధ సమస్యలతో ఆహారం తీసుకోలేకపోయారు. దీనితో ఆయన తనువు చాలించారు. ఆయన అంత్యక్రియలు మంగళవారం నాడు జరిపినట్లు గిన్నిస్ బుక్ ప్రతినిధులు వెల్లడించారు.
 
కాగా చిటెట్సు వటనాబే 1907లో ఉత్తర జపాన్ దేశంలోని నీగటాలో జన్మించారు. ఈయనకు ఐదుగురు సంతానం కాగా 12 మంది మనవళ్లు, 17మంది ముని మనవండ్లు ఉన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొడుకును బయటనిలబెట్టి లాడ్జిలో ప్రియుడితో ఎంజాయ్, భర్త వీడియో కాల్ చేయడంతో దొరికిపోయిన భార్య