Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సీఎం నిర్దేశించిన పనులు నిర్ణీత సమయంలో పూర్తి: మంత్రి గౌతమ్ రెడ్డి

సీఎం నిర్దేశించిన పనులు నిర్ణీత సమయంలో పూర్తి: మంత్రి గౌతమ్ రెడ్డి
, శుక్రవారం, 28 ఫిబ్రవరి 2020 (08:14 IST)
నైపుణ్యాభివృద్ధి, శిక్షణకు సంబంధించి ముఖ్యమంత్రి నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని పరిశ్రమలు. వాణిజ్య, ఐటీ, జౌళి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి వెల్లడించారు.

అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ కచ్చితత్వం పాటించాలని మంత్రి మేకపాటి అధికారులను ఆదేశించారు. నైపుణ్య విశ్వవిద్యాలయాలు, నైపుణ్య కళాశాలల ఏర్పాటుకు కావలసిన భూములను గుర్తించడం, డిజైన్లను , నమూనాలకు సంబంధించిన విషయాలలో సమయపాలన పాటించాలన్నారు.

వెలగపూడి సచివాలయంలో నాలుగవ బ్లాక్, మొదటి అంతస్తులో ఉన్న సమావేశ మందిరంలో మంత్రి గౌతమ్ రెడ్డి నైపుణ్యాభివృద్ధి, శిక్షణశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఎన్ఎస్డీసీ రుణాలు, నిధుల సమీకరణ, నిధుల వేట నిత్యం జరిగే ప్రక్రియ అని, ఈ అంశంలో రాజీపడకుండా, అన్నిరంగాలను ప్రోత్సహించే విధంగా చిత్తశుద్ధితో నిధుల సమీకరణకు ప్రయత్నించాలని అధికారులకు సూచించారు.

వారం, నెలల వారీగా నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ కచ్చితమైన చేయవలసిన పనులను ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. రంగాల వారీగా డిమాండ్ ఉన్న ఉద్యోగాలు, విద్యార్థులు ఆశించే కోర్సులు, ఆశలకు అనుగుణంగా పక్కా ప్రణాళికతో అనుకున్నవి పూర్తి చేసుకుంటూ వెళ్లాలని మంత్రి అన్నారు.

25 స్కిల్ కాలేజీలు,2  విశ్వవిద్యాలయాలకు కావాల్సిన భూముల గుర్తింపు, నమూనాల పరిశీలన, అత్యాధునిక హంగులు, మార్పులు, చేర్పులపై నిర్ణయం,  కాలేజీల్లో ఉండవలసిన మౌలిక వసతులు, డిజిటల్ తరగతులకు అవసరమైన సదుపాయాలు, వీటిని ఏర్పాటు చేయడానికి కావలసిన బడ్జెట్, కేంద్ర ప్రభుత్వం పథకాల ద్వారా వీలైనంత ఎక్కువ నిధుల సమీకరణ వంటి అనేకాంశాలను మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధికారులతో చర్చించారు.

ల్యాబ్ ఎక్విప్ మెంట్, బోధన, బోధనేతర ఉపాధ్యాయుల నియామకం, భాగస్వామ్యం, ఒప్పందాలు, నాలెడ్జ్ పార్ట్ నర్లు, బ్రాండింగ్, వర్క్ షాప్ వంటి విషయాలపై మంత్రి సమాలోచనలు జరిపారు. తర్వాత జరిగే సమీక్ష సమావేశంలోగా పూర్తి చేయవలసిన పనులపై మంత్రి అధికారులకు స్పష్టతనిచ్చారు.

అనంతరం, గతవారం సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రి గౌతమ్ రెడ్డి  ఛైర్మన్ గా నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి, ఐ.టీ అడ్వైజర్ , ఏపీఎస్ఎస్డీసీ ఎండీ, సీఈవో అర్జా శ్రీకాంత్ సభ్యులుగా ఏర్పాటైన కమిటీ సమావేశమైంది.

ఈ భేటీ ప్రధానంగా ఏపీలోని ఇంజనీరింగ్ కాలేజీలలో చేపడుతున్న నైపుణ్య కార్యక్రమాలపై చర్చ జరిగింది. 8 వారాలలోగా దీనిపై నివేదిక రూపొందించే వీలుగా సత్వరం చేపట్టాల్సిన చర్యలపై కమిటీ ఛైర్మన్ మేకపాటి సభ్యులతో చర్చించారు.

నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశంలో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంత రాము, ఉపాధి, శిక్షణ డైరెక్టర్ లావణ్యవేణి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి, ఏపీఎస్ఎస్ డీసీ ఎండీ అర్జా శ్రీకాంత్, ఐ.టీ సలహాదారులు విద్యాసాగర్  రెడ్డి, లోకేశ్వర రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'వైఎస్‌ఆర్ విలేజ్ క్లినిక్‌' మార్గదర్శకాలివే