Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడిపుంజు కనిపించట్లేదు సార్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తి.. ఎక్కడ?

Webdunia
గురువారం, 2 జూన్ 2022 (15:31 IST)
పెంపుడు జంతువులపై చాలామంది ప్రేమ వుంటుంది. ఇంట్లో కుక్క పిల్ల తప్పిపోతే వెతికిపెట్టాలని కొంతమంది ప్రకటనలు ఇచ్చిన దాఖలాల గురించి వినే వుంటాం. తాజాగా ఓ కోడిపుంజు చోరీకి గురైందంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులకు ఈ కేసు తలనొప్పిగా మారింది. 
 
వివరాల్లోకి వెళితే.. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం, తాటిగుంటపల్లి పంచాయతీ పరిధిలోని పెద్దవంకపల్లెకు చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి లక్ష్మయ్య కుమారుడు వెంకటాద్రి కోడిపుంజు చోరీ అయ్యిందంటూ.. లబోదిబోమంటూ వాల్మీకిపురం పోలీసులను ఆశ్రయించాడు.  
 
తన తెల్ల కోడి పుంజును దొంగలు ఎత్తుకెళ్లారు అని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అల్లారుముద్దుగా పెంచుకున్నజాతి కోడి పుంజును దొంగలు ఎత్తుకెళ్లారని వాపోయాడు. గత నెల 29వ తేదీన పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు.  మూడు రోజుల క్రితం దొంగలు రూ. 9వేల విలువగల జాతి కోడిపుంజును ఎత్తుకెళ్లారు. 
 
గ్రామ పరిసరాల్లో కోడిపందాలు జరుగుతుంటాయని, పందాల కోసమే దొంగలు ఎత్తుకెళ్లారు అని అనుమానం వ్యక్తం చేశాడు. అయితే ఇందుకు భిన్నంగా రక్తం పంచుకు పుట్టిన బిడ్డలతో సమానంగా పెంచుకున్న కోడిపుంజును దొంగలు ఎత్తుకెళ్లారు అని ఫిర్యాదు చేయడం గమనార్హం. వెంకటాద్రి ఇచ్చిన ఫిర్యాదు తీసుకుని విచారణ చేస్తున్నామని ఎస్సై బిందుమాధవి మీడియాకు తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

తర్వాతి కథనం
Show comments