Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తక్షశిల ఐఎఎస్ అకాడమీ మార్గనిర్దేశకత్వంలో ఎనిమిది మందికి సివిల్ సర్వీసెస్ ర్యాంకులు

Takshasila
, బుధవారం, 1 జూన్ 2022 (20:04 IST)
తక్షశిల ఐఎఎస్  అకాడమీ మార్గదర్శకత్వం వహించిన 8 మంది విద్యార్థులు అఖిల భారత స్ధాయిలో సివిల్ సర్వీసెస్ ర్యాంక్‌లు సాధించారని అకాడమీ డైరెక్టర్ డాక్టర్ బిఎస్ఎన్ దుర్గాప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎం.మౌర్య భరద్వాజ్ (28-విశాఖపట్నం),  స్నేహ (136-నిజామాబాద్), ఎస్ చిత్తరంజన్ (155-హైదరాబాద్), ఎస్.ప్రత్యూష్ (183-హైదరాబాద్), S. శ్రీనివాస్ (310-కాకినాడ), డిఎస్ వి అశోక్ (350-కాకినాడ), పవిత్ర (608-హైదరాబాద్), బి.అరవింద్ (623-విశాఖపట్నం) తదితరులు జాతీయ స్ధాయిలో విజేతలుగా నిలిచారన్నారు.

 
ఈ సందర్భంగా విద్యార్థులకు మార్గనిర్దేశం వహించిన అకాడమీ డైరెక్టర్ డాక్టర్ బిఎస్ఎన్ దుర్గా ప్రసాద్, విభిన్న రూపాలలో వారికి సలహాదారులుగా వ్యవహరించి తక్షశిల అకాడమీ ద్వారా పరీక్షకు సన్నద్దం చేసిన మాజీ ఐఎఎస్ అధికారులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ, రేచల్ ఛటర్జీ , డాక్టర్ ప్రియదర్శిని దాస్, టి.చటర్జీ, విఎన్ విష్ణు విద్యార్థులను అభినందించారు.

 
దేశానికి సేవ చేయడంలో వారి భవిష్యత్ ప్రయత్నాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. విజయవాడ, హైదరాబాద్, వైజాగ్‌లలో క్యాంపస్‌లు కలిగిన తక్షశిల ఐఎఎస్ అకాడమీ గడిచిన ఆరు సంవత్సరాల స్వల్ప వ్యవధిలో 24 అఖిల భారత ర్యాంక్‌లను అందించిన అరుదైన ఘనతను కలిగి ఉందని దుర్గా ప్రసాద్ పేర్కొన్నారు. తక్షశిల ఐఎఎస్ అకాడమీ సివిల్స్ శిక్షణను కోరే పేద విద్యార్థులతో పాటు ఐఐటి, ఎన్ఐటి విద్యార్థులకు మెరిట్ స్కాలర్‌షిప్‌లను కూడా అందిస్తుందన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లి విందు.. రెండోసారి భోజనం చేసిన మహిళపై కర్రలతో దాడి