Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైఎస్సార్ రైతు భరోసా.. ప్రతి రైతు కుటుంబానికి ఏటా 13,500.. అంతర్జాతీయ గుర్తింపు

ys jagan
, బుధవారం, 1 జూన్ 2022 (17:25 IST)
వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని ఏపీలోని వైఎస్ జగన్ సర్కారు అమలులోకి తెచ్చింది. రైతులకు ఆర్థికంగా సహాయం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ఈ కార్యక్రమానికి అన్నదాతలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 38 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చడానికి రూ.3785 కోట్లను విడుదల చేస్తూ 2019 అక్టోబర్ 15న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ రైతు భరోసాను ప్రారంభించారు.
 
మొక్కలు, ఎరువులు, విత్తనాలు సరఫరా చేసేందుకు రైతు భరోసా కేంద్రాలను 2020 మే 30న ప్రారంభించారు. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.7500, కేంద్ర ప్రభుత్వం రూ.6000 విరాళంగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధితో కలిపి సంవత్సరానికి 13,500 రూపాయల మొత్తాన్ని మూడు విడతలుగా రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతోంది.  
 
అన్నదాతలు రైతు భరోసా కేంద్రానికి వెళ్లి సంప్రదిస్తే వైఎస్సార్ రైతు భరోసా పథకంలోకి చేర్చుకుంటారు. రైతులు పొలం పట్టా, ఆధార్ కార్డు, రేషన్ కార్డు లాంటి డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. అర్హులకు వైఎస్సార్ రైతు భరోసా స్కీమ్ కింద ఏపీ ప్రభుత్వం ప్రతి ఏటా 13,500 రూపాయలను మూడు విడతలుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తుంది. 
webdunia
Raitu Bharosa
 
విత్తనం నుంచి విక్రయాల దాకా రైతన్నలకు చేదోడువాదోడుగా నిలిచి గ్రామాల్లోనే సేవలందిస్తున్న వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలకు (ఆర్బీకే) అంతర్జాతీయంగా గుర్తింపు లభించనుంది. 
 
ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏవో) అందించే ప్రతిష్టాత్మక "ఛాంపియన్‌" పురష్కారానికి ఆర్బీకేలను కేంద్ర ప్రభుత్వం 2022 మే నెలలో నామినేట్‌ చేసింది.
 
ఏపీ వైఎస్సార్ రైతు భరోసా పథకం ప్రధానాంశాలు 
 
ప్రధానంగా ఏపీ వైఎస్సార్ రైతు భరోసా పథకం సాయంతో రైతులందరికీ రూ.50,000/-లు అందుతాయి.  5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులందరికి ఇది వర్తిస్తుంది. 
 
సీజన్ ప్రారంభం కావడానికి ముందు అంటే ఖరీఫ్, రబీ సీజన్, భూమిని కలిగి ఉన్న రైతులందరికీ రూ.13500/- పొందడానికి అనుమతించబడుతుంది. కౌలు రైతులందరూ కూడా మొత్తం రూ.2500/- పొందడానికి అర్హులు.
 
ఏపీ వైఎస్సార్ రైతు భరోసా పథకానికి ప్రధాన అంశం ఏమిటంటే రైతులందరికీ ఇచ్చే మొత్తాన్ని నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయడమే. రైతుల ఖాతాలో నేరుగా జమ చేయడం వల్ల దళారుల జోక్యాన్ని నివారిస్తుంది. అలాగే ఇది అవినీతిని తొలగించడానికి కూడా దారితీస్తుంది.
 
అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకం కింద బోరుబావుల సౌకర్యాన్ని కల్పించింది. అందువల్ల, వైఎస్సార్ రైతు భరోసా కింద, సుమారు 200 బోరుబావులు కేటాయించబడతాయి.
 
ఏపీ వైఎస్సార్ రైతు భరోసా పథకం సాయంతో పగటిపూట ఉచిత కరెంట్ సరఫరా చేయాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. అంతేకాక, ప్రజలు దాదాపు 9 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరాను పొందుతారు.  ఇది రైతులకు గుడ్ న్యూసేనని చెప్పాలి.
 
అంతేకాక, అర్హత కలిగిన రైతులు ఈ సంక్షేమ ప్లాట్ నుండి ఎక్కువ ప్రయోజనాన్ని పొందవచ్చు. మరింత సమాచారం కోసం, ysrrythubharosa.ap.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
 
గోదాముల నిర్మాణం, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నీ వైఎస్సార్ రైతు భరోసాతో పూర్తవుతాయని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. పాల పంపిణీదారులు/ కంట్రిబ్యూటర్లకు సబ్సిడీ అందించే అన్ని పాల డైరీలను ఒకే సమయంలో తిరిగి తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 
రైతులకు చెందిన అన్ని ట్రాక్టర్లకు రోడ్డు ట్యాక్స్ రద్దు చేయబడుతుంది. ఇంకా ఆక్వా రైతులకు రూ. 1 చొప్పున సబ్సిడీ ఇస్తారు. ప్రస్తుత వినియోగంపై యూనిట్ కు రూ. 50 ఇవ్వబడుతుంది.
 
వైఎస్సార్ రైతు భరోసా సాయంతో రైతులందరికీ ప్రీమియం బీమాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లిస్తుంది.
పైన పేర్కొన్న బీమా రైతులపై ఆధారపడిన వారికి దాదాపు రూ. 5 లక్షలను కవర్ చేస్తుంది.
 
ఎవరు అర్హులు :
 
1. తెల్ల రైస్ కార్డు ఉండాలి
 
2. భూమి 5 ఎకరాలు మించరాదు
 
3. అర్హత ఉన్న కౌలు రైతులు అర్హులే
 
4. కుటుంభంలో ప్రభుత్వ ఉద్యోగి ఉండరాదు
 
5. విద్యుత్ వాడకం నెలకి 300 యూనిట్లు దాటకూడదు
 
6. ప్రభుత్వానికి టాక్స్ కట్టరాదు చేయరాదు
 
ఎల్లా అప్లై చేయాలి :
 
గ్రామా /వార్డ్ సచివాలయాలలో ఆధార్ కార్డు , భూమి పట్టా నకలుతో
వాలెంటీర్ ద్వారా అప్లై చేయాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంటింటి సంక్షేమ పథక సర్వే పత్రాం దగ్దం చేసిన వలంటీర్