Webdunia - Bharat's app for daily news and videos

Install App

'శిల్పారామం' వెబ్ సైట్ ప్రారంభం

Webdunia
శుక్రవారం, 27 నవంబరు 2020 (22:33 IST)
భారతదేశ గొప్పదనాన్ని చాటి చెప్పేలా రాష్ట్రంలో అన్ని శిల్పారామాలను తీర్చి దిద్దుతామని రాష్ట్ర పర్యాటక,యువజన అభివృద్ధి శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు అన్నారు. సచివాలయం మూడో బ్లాక్ లోని తన ఛాంబరులో శుక్రవారం నూతనంగా రూపొందించిన శిల్పారామం వెబ్ సైట్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 8 శిల్పారామాలు ఉన్నాయని అన్నారు. ఇప్పటికే వీటిల్లో ప్రభుత్వ పరంగా,ప్రైవేట్ పరంగా అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని అన్నారు. గతంలో ఈ శిల్పారామాల సమాచారం తెలుసుకోవాలంటే అక్కడికి వెళ్ళి,సంబంధిత వ్యక్తులతో మాట్లాడి తెలుసుకోవాల్సి వచ్చేదని అన్నారు.

ఇక ఇప్పుడు అటువంటి పరిస్థితి తలెత్తకుండా అందుబాటులో ఉన్న సాంకేతిక విధానాన్ని అనుసరించి శిల్పారామం పేరుతో ప్రతేక్య వెబ్ సైట్ ను రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు. విదేశీయులు,దేశీయులు ఈ శిల్పారామాల పూర్తి సమాచారం తెలుసుకునేలా దీనిని రూపొందించడం జరిగిందన్నారు.

యాప్ ను అభివృద్ధి చేసేందుకు తమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సూచనలు,సలహాలను తీసుకొని మార్పులు చేస్తామన్నారు. దేశ వ్యాప్తంగా తొలిసారిగా శిల్పారామాల్లో 5స్టార్ లెవల్ కన్వెన్షన్ హాల్స్ ఏర్పాటుచేసి అభివృద్ధి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి భారీ మార్పులకు శ్రీకారం చుట్టారని అన్నారు.

అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగంలో ప్రధాన ఆకర్షణంగా శిల్పారామాలను తీర్చిదిద్దడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలో శిల్పారామాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 8 శిల్పారామాలలో సంస్కృతి,సాంప్రదాయాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడం జరిగిందని మంత్రి శ్రీనివాసరావు పేర్కొన్నారు.

ప్రైవేట్ పర్యాటక ప్రాంతాలకన్నా భిన్నంగా,ప్రభుత్వ పర్యాటక రంగాన్ని ఆధునిక జీవన విధానాలను అలవర్చుకుంటూనే,రాష్ట్ర ప్రగతిని చాటి చెప్పేలా మార్పులను తీసుకువచ్చామని అన్నారు, అప్పటి రాష్ట్ర చరిత్ర,శిల్పకళలు,జీవనం ఉట్టిపడేలా పూర్తి స్థాయి సమాచారం ఈ వెబ్ సైట్ లో పొందుపరచడం జరిగిందని అన్నారు.

ఈ సందర్భంగా “shilparamamap.net” వివరాలను తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజిత్ భార్గవ,ఎపిటిడిసి మేనేజింగ్ డైరెక్టర్,ఎపిటిఎ ఛీప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్,శిల్పారామం ఛీప్ ఎగ్జిక్యూటివ్  ఆఫీసర్ బి.జయరాజ్,ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments