Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీ నిరుద్యోగులూ! ఈ వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌కండి..మీకే లాభం!

ఏపీ నిరుద్యోగులూ! ఈ వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌కండి..మీకే లాభం!
, సోమవారం, 6 జులై 2020 (10:25 IST)
నిరుద్యోగులు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గొప్ప వరాన్ని ప్రకటించింది.

ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌ సోర్స్‌డ్‌ సర్వీసెస్‌ (ఆప్కాస్‌) కార్పొరేషన్‌ను ప్రారంభించి నిరుద్యోగులు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల పాలిట వరంలా మారింది.

దీని ద్వారా లంచాలు, రికమండేషన్లకు తావులేకుండా.. పారదర్శకంగా కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. కలెక్టర్ల ఆధ్వర్యంలోని కమిటీలు ఈ నియామకాలను చేపడతాయి. పూర్తి వివరాలకు http://apcos.ap.gov.in/ వెబ్‌సైట్‌ సందర్శించవచ్చు. ఇది 100 శాతం ప్రభుత్వ రంగ సంస్థ.                                              
అసలు లక్ష్యమిదే..!
పూర్తి పారదర్శక విధానంలో స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్‌ స్కిల్డ్‌ మ్యాన్‌పవర్‌ను గుర్తించడం.
వివిధ శాఖలు, సంస్థల అవసరాలను తీర్చేలా శాస్త్రీయ విధానంలో కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, సిబ్బంది ఎంపిక.
చట్టబద్ధంగా ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌)తో పాటు ఈఎస్‌ఐ లాంటి సదుపాయాలు అందేలా చూడటం.

రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలు, కార్యాలయాల్లో ఔట్‌ సోర్సింగ్‌ ప్రక్రియకు సంబంధించి వన్‌–స్టాప్‌–షాప్‌ గా ఆప్కాస్‌ పని చేస్తుంది.
 
ఇంకా ఏమిటంటే..?
ఇప్పటికే వివిధ శాఖలు, సంస్థల్లో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, సిబ్బందిని కార్పొరేషన్‌ పరిధిలోకి చేరుస్తారు.
ఇక నుంచి కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులందరికీ ఆప్కాస్‌ మాత్రమే ప్లేస్‌మెంట్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది.

ఇప్పుడు ఔట్‌ సోర్సింగ్‌లో పని చేస్తున్న ఏ ఒక్క ఉద్యోగిని తొలగించరు. ఈ ప్రక్రియ అంతా సజావుగా సాగేలా యునిక్‌ కోడ్‌ ఇస్తారు. రిజర్వేషన్ల ప్రక్రియను పక్కాగా అమలు చేస్తారు.

కార్పొరేషన్‌ పరిధిలోకి ఆయా ఉద్యోగులను బదలాయించే సమయంలో పే స్లిప్‌లు, బ్యాంక్‌ ఖాతాలు, ఈపీఎఫ్, ఈఎస్‌ఐకి సంబంధించిన ఖాతాల వివరాలు సేకరిస్తారు.

కార్పొరేషన్‌ పరిధిలోకి ఉద్యోగుల బదిలీ ప్రక్రియను సమీక్షించడానికి జిల్లా స్థాయిలో ఏర్పాటయ్యే కమిటీకి కలెక్టర్‌ నేతృత్వం వహిస్తారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ మెంబర్‌ కన్వీనర్‌గానూ, ఆ సంస్థల నుంచి ఒక ప్రతినిధి కమిటీ మెంబర్‌గా ఉంటారు.

ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీలు, మైనారిటీలకు 29 శాతం రిజర్వేషన్లు కల్పిస్తారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ ఉంటుంది.

రిజర్వేషన్లు సక్రమంగా అమలయ్యేలా జిల్లా స్థాయి కమిటీలు పర్యవేక్షిస్తాయి. కొత్త అభ్యర్థులను కూడా జిల్లా స్థాయి కమిటీలు సూచిస్తాయి.
 
ఏమిటి ప్రయోజనం..?
ప్రైవేట్‌ ఔట్‌ సోర్సింగ్‌ సంస్థలు, దళారులు తొలగిపోతారు.
అవినీతి లేకుండా పారదర్శకంగా ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది నియామకాలు జరుగుతాయి.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం ఉద్యోగాలు దక్కనుండగా అందులో సగం మహిళలకు లభిస్తాయి.
ఎలాంటి కోతలు లేకుండా కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, సిబ్బందికి బ్యాంకు ఖాతాల ద్వారా నెల నెలా పూర్తి వేతనాలు అందుతాయి.
ఈపీఎఫ్, ఈఎస్‌ఐ సదుపాయాలుంటాయి.
లంచాలు, వివక్ష లేకుండా నియామకాలు జరుగుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా బారిన పడకూడదనుకుంటున్నారా?.. అయితే ఈ 15 విషయాలను పాటించండి