Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా బారిన పడకూడదనుకుంటున్నారా?.. అయితే ఈ 15 విషయాలను పాటించండి (video)

కరోనా బారిన పడకూడదనుకుంటున్నారా?.. అయితే ఈ 15 విషయాలను పాటించండి (video)
, సోమవారం, 6 జులై 2020 (10:18 IST)
కోవిడ్-19 బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ ఈ కింద ఇవ్వడిన 15 విషయాలను జాగ్రత్తగా పాటించాలి. మనం వ్యక్తిగతంగా ఎంత జాగ్రత్త తీసుకంటామో కోవిడ్-19కు అంత దూరంగా ఉన్నట్టు లెక్క.

ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా కోవిడ్-19ను మనం ఆహ్వానించినట్టే. కాబట్టి ప్రతిఒక్కరూ స్వీయ జాగ్రత్తలు తీసుకుందాం. కోవిడ్-19ను సమర్థవంతంగా ఎదుర్కొందాం.
 
1. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకరికొకరు తాకకుండా పలకరించుకోండి. షేక్ హ్యాండ్ ఇవ్వకుండా నమస్కారం చేయండి
 
2. ఇద్దరి మధ్య కనీసం ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాలి
 
3. ముఖానికి తప్పనిసరిగా మాస్కు లేదా కవర్ ను ధరించండి
 
4. కళ్లు, ముఖ్కు, నోటిని తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దగ్గు, తుమ్ము వచ్చేటప్పుడు టిష్యూ లేదా గుడ్డతో ముక్కు, నోరు కప్పుకోవాలి.
 
5. శ్వాసకోశ సంబంధనమైన ఇబ్బందులు, జలుబు, ఫ్లూ లాంటి లక్షణాలు ఉన్నవారికి దూరంగా ఉండండి 
 
6. చేతులను తరచుగా సబ్బు నీళ్లు లేదా ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ రబ్స్ తో శుభ్రంగా కడగాలి
 
7. పొగాకు, ఖైనీ తదితర నిషిద్ధమైనవి నమలవద్దు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయవద్దు
 
8. తరచూ తాకే, ఉపయోగించే వస్తువులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడంతోపాటు క్రిమిసంహారం చేయాలి.
 
9. అత్యవసరమైన ప్రయాణాలు మాత్రమే చేయండి. అనవసరంగా బయటకు గానీ, ప్రయాణాలు కూడా పెట్టుకోవద్దు. 
 
10. ఇతరుల పట్ల వివక్షను చూపకండి
 
11. ఎక్కువ మంది ఒకేచోట గుమికూడడాన్నితగ్గించండి. సురక్షితంగా ఉండడాన్ని ప్రోత్సహించం డి
 
12. కోవిడ్ పై నిర్ధారితం కానీ, ధృవీకరించబడని కథనాలు, వార్తలను సోషల్ మీడియాలో ప్రచారం చేయకండి
 
13. కోవిడ్-19కి సంబంధించిన విశ్వసనీయ వర్గాల ద్వారా వచ్చిన సమాచారాన్ని మాత్రమే నమ్మండి
 
14. కోవిడ్-19కి సంబంధించిన ఎలాంటి సమాచారం కోసమైనా, ఇతర సహాయం కోసమైనా జాతీయస్థాయి హెల్ప్ లైన్ 1075, రాష్ట్రస్థాయిలో 104కి కాల్ చేయవచ్చు. వై.ఎస్.ఆర్ టెలీమెడిసిన్ నెంబర్ 14410కు మిస్డ్ కాల్ ఇచ్చి ఫోన్ ద్వారా డాక్టర్ గారితో మాట్లాడి మీ ఆరోగ్య సమస్యలను తెలపవచ్చు. 
 
15. ఏదైనా ఒత్తిడి లేదా ఆందోళనకు గురైతే వైద్య సలహాలు తీసుకోండి

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో ఐదు నెలలపాటు ఉచితంగా బియ్యం