Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కోవిడ్ 19: ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి సూచనలు, సలహాలు

Advertiesment
కోవిడ్ 19: ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి సూచనలు, సలహాలు
, శుక్రవారం, 3 జులై 2020 (13:20 IST)
ఆసుపత్రులలో పనిచేసే ఆరోగ్య సంరక్షణ సిబ్బంది తమ విధుల్లో భాగంగా రోగులకు చికిత్స అందించేటప్పుడు వారి వ్యక్తిగత రక్షణలో నిర్లక్ష్యం వహిస్తే వారు కోవిడ్ బారినపడే ప్రమాదం పొంచి ఉంటుంది.
 
ఆరోగ్య సంరక్షణ సిబ్బంది ప్రస్తుత పరిస్థితుల్లో విలువైన మరియు అత్యవసరమైన వనరు. ఒక వేళ పెద్ద సంఖ్యలో ఆరోగ్య సంరక్షణ సిబ్బంది కోవిడ్-19 ప్రభావానికి గురైతే ఇతర ఆరోగ్య సంరక్షణ సిబ్బందిపైనా ప్రభావంపడి ఆసుపత్రిలో రోగులకు చికిత్స అందించే కార్యక్రమాలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. 
 
ఈ నేపథ్యంలో ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు కోవిడ్-19 బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ చర్యలు, ఒకవేళ ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు కోవిడ్19 ప్రభావానికి గురి అయితే వారు క్వారంటైన్ మరియు ఐసోలేషన్ నిర్వహణకు తీసుకోవాల్సిన మార్గదర్శకాలను కేంద్ర వైద్య, ఆరోగ్యమంత్రిత్వశాఖ విడుదల చేసింది.  
 
ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు చికిత్స అందించే సందర్భంలో ఇన్ఫెక్షన్ల బారి పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిర్దేశించిన విధి విధానాలు: 

- ప్రతి ఆస్పత్రిలో హాస్పిటల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ కమిటీ ఏర్పాటు చేయాలి. 

- ప్రతి హాస్పిటల్లో ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ కార్యకలాపాలను అమలు చేయడం మరియు ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు కోసం ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ వంటి కార్యక్రమాలపై శిక్షణ తరగతులను నిర్వహించడం హాస్పిటల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ కమిటీ బాధ్యత. 
 
- ప్రతి ఆసుపత్రి లో హెల్త్‌కేర్‌ అసోసియేటెడ్ ఇన్ఫెక్షన్ కు సంబంధించిన అన్ని విషయాలను పరిష్కరించడానికి నోడల్ ఆఫీసర్ (ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఆఫీసర్)ను గుర్తించాలి. ఆరోగ్య సంరక్షణ కార్మికులలో ఇటువంటి ఇన్ఫెక్షన్లను  నివారించడానికి, అతను / ఆమె ఈ కింది చర్యలు అమలు జరిగేలా చూస్తారు.
 
i. ఆసుపత్రుల యొక్క వివిధ విభాగాలలోని ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, సిబ్బంది కేంద్ర ఆరోగ్య  మంత్రిత్వ శాఖ ద్వారా జారీ చేసిన మార్గదర్శకాలలో వివరించిన విధంగా వారి రిస్క్ ప్రొఫైల్‌ అనుసరించి తగిన పీపీఈ కిట్లను ధరించాలి.
 
ii. ఆరోగ్య సంరక్షణ కార్మికులందరూ ఇన్ఫెక్షన్ నివారణ మరియు నియంత్రణపై శిక్షణ పొందడమే కాకుండా వారు వ్యాధి సాధారణ సంకేతాలు మరియు లక్షణాల గురించి తెలుసుకుంటారు. స్వీయ-ఆరోగ్య పర్యవేక్షణ ద్వారా అటువంటి లక్షణాలను గమనించినపుడు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని సూచనలు ఇవ్వాలి. 
 
iii. ఆసుపత్రి సిబ్బంది అందరికీ రెగ్యులర్‌గా థర్మల్ స్క్రీనింగ్ చేయడం కోసం తగిన ఏర్పాట్లు, సదుపాయాలు అందుబాటులో ఉంచాలి.
 
iv. కోవిడ్-19 కేసులకు చికిత్స అందించే ఆరోగ్య కార్యకర్తలందరికీ వైద్య పర్యవేక్షణలో కీమో-ప్రొఫిలాక్సిస్ అందించాలి.
 
v. పిపిఇ కిట్లు ధరించడానికి నిరాకరించేవారు, నిబంధనలు ఉల్లంఘించే ఆసుపత్రి సిబ్బందిని గుర్తించి మరియు తదుపరి తీసుకునే చర్యలకు సంబంధించి తగిన సదుపాయాలు కల్పించబడాలి.
 
ఆరోగ్య కార్యకర్తల కోసం తీసుకోవాల్సిన చర్యలు: 
i. తరచుగా చేతులు కడుక్కోవడం, ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్ వాడడం, శ్వాసకోశ ఇబ్బందులు (దగ్గు లేదా తుమ్ము వచ్చే సమయంలో  నీటి తుంపర్లు పడకుండా అడ్డుకోడానికి రుమాలు ఉపయోగించడం) పాటించడం వంటి మొదలైన అన్ని నివారణ చర్యలు అన్ని సమయాల్లో పాటించేలా చూడాలి.
 
ii. అతను / ఆమె విధి నిర్వహణలో ఉన్నప్పుడు అన్ని సమయాల్లో తగిన పీపీఈ కిట్‌ని ధరించాలి.
 
iii. ఆరోగ్య సంరక్షణ సిబ్బంది అంతా విధి నిర్వహణలో సంక్రమణ నివారణ మరియు నియంత్రణ పద్ధతులను ఉల్లంఘించలేదని నిర్ధారించడానికి ఒక వ్యవస్థని ఏర్పాటుచేయాలి. ఈ వ్యవస్థలో సిబ్బంది యొక్క భద్రత మరియు శ్రేయస్సు కోసం బాధ్యతలను పంచుకునే ఆసుపత్రి సిబ్బందిలో నుంచి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందితో కూడిన బృందం ఉండాలి. 
 
వీరు (i) పిపిఈలను సముచితంగా ధరించడం మరియు తొలగించడం,
 
 (ii ) చేతులను పరిశుభ్రతలను పాటించడం మరియు (iii) పిపిఈ కిట్ వినియోగించే నిబంధనలను ఉల్లంఘించే వ్యక్తులను గమనించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటుంది.
 
iv. ఆరోగ్య సంరక్షణ సిబ్బంది పీపీఈ ధరించడంలో ఏదేనా ఉల్లంఘనలు పాల్పడితే  మరియు వైరస్‌కి ప్రభావితం అయితే వెంటనే డిపార్టుమెంట్ యొక్క నోడల్ ఆఫీసర్ కు తెలియజేయాలి.  
 
v. ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు వార్డులు / ఒపిడిలు / ఐసియు  నందు విధులు ముగిసిన తరువాత వైద్యులు ఉండే డ్యూటీ రూమ్ లు / హాస్టళ్లు / క్యాంటీన్లలో లేదా ఆరోగ్యకేంద్రం వెలుపల వైరస్ ప్రభావితమైన ఇతర ఆరోగ్య సంరక్షణ కార్మికుల నుంచి సంక్రమణను నివారించడానికి సామాజిక దూరంతోపాటు తగిన మాస్క్ ధరించాలి.
 
vi. గర్భిణీలు / పాలిచ్చే తల్లులు మరియు రోగనిరోధక-శక్తి తక్కువ గల ఆరోగ్య కార్యకర్తలు వారి వైద్య పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆసుపత్రి అధికారులకు తెలియజేయాలి. అటువంటి వారికి కోవిడ్ కాని ఆరోగ్య కేంద్రాల్లో మాత్రమే విధులను కేటాయించడం జరుగుతుంది.
 
*అధిక ప్రభావానికి :
• కోవిడ్-19 వ్యాధి గ్రస్తులకు సంరక్షణ ఇచ్చే వ్యక్తి లేదా చికిత్స అందించే ఆరోగ్య సిబ్బంది మరియు సిఫార్సు చేసిన పీపీఈని సరిగ్గా ధరించకుండా కోవిడ్-19 బాధితుల నుండి శ్వాసకోశ నమూనాలను నిర్వహించే ల్యాబ్ సిబ్బంది లేదా ఇతర వ్యక్తులు. 
 
• ముఖానికి తగిన మాస్క్, ఫేస్-షీల్డ్, కళ్ళద్దాలు లేని ఆరోగ్య సిబ్బంది.
 
• కోవిడ్-19 కేసుతో 1 మీటర్ లోపల 15 నిమిషాలకు పైగా ముఖాముఖి పరిచయం కలిగి ఉండటం.
 
• కోవిడ్ వ్యాధి గ్రస్తుని శరీర ద్రవాలను  ప్రమాదవశాత్తు ముట్టుకోవడం.
 
*తక్కువ ప్రభావానికి: 
అధిక రిస్క్ ప్రభావం ప్రమాణాలకు అనుగుణంగా లేని పరిచయాలు మరియు నోడల్ ఆఫీసర్ / డిపార్ట్మెంట్ హెడ్ అనుబంధం లోని అసెస్‌మెంట్ ఫార్మాట్ ప్రకారం ప్రభావం స్థాయిని మరియు ప్రమాదాన్ని అంచనా వేయడానికి ఉప కమిటీని ఏర్పాటు చేస్తారు. వారి అంచనా ప్రకారం:
 
• అధిక ప్రమాదం ఉన్న వైద్యులు, నర్సింగ్ అధికారులు మరియు ఇతర ఆరోగ్య కార్యకర్తలకు, ప్రారంభంలో నిర్బంధ కాలం అనేది ఒక వారం రోజులు మాత్రమే ఉంటుంది
 
• అటువంటి వైద్యులు, నర్సింగ్ అధికారులు మరియు ఇతర ఆరోగ్య కార్యకర్తల వివరాలు సేకరించి పరిస్థితులు గమనించిన తరువాత, నోడల్ ఆఫీసర్ / డిపార్టుమెంట్ హెడ్ లేదా ఆయన నియమించిన సబ్-కమిటీ నిర్బంధ కాలాన్ని మరి ఒక వారం పాటు పెంచుతూ  నిర్ణయం తీసుకుంటారు.
 
• ఒక వారం తరువాత, వారు కోవిడ్ పరీక్ష ప్రోటోకాల్ ప్రకారం పరీక్షించబడతారు, లక్షణాలు అభివృద్ధి చెందుతున్నావా లేవా అనేది నిర్దేశించిన ప్రోటోకాల్ ప్రకారం చురుకుగా పర్యవేక్షించి నిర్వహిస్తారు
 
• ఒకవేళ పాజిటివ్ గా నిర్ధారించబడి తేలికపాటి లక్షణ రహితంగా ఉంటే వారు క్రింద పారా 5.2.1 (ఎ) లో వివరించిన విధంగా / ప్రిసింప్టోమాటిక్ కేసులకు సంబంధించి   ప్రోటోకాల్‌ను అనుసరిస్తారు.
 
• పరీక్షలో నెగటివ్ గా నిర్ధారించబడి లక్షణ రహితంగా ఉంటే, 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకుని తిరిగి పనికి వస్తారు.
 
• ఒకవేళ లక్షణాలు గుర్తిస్తే, మార్గదర్శకం పేరా 5.2 ను అనుసరించి చర్యలు తీసుకోబడతాయి 
 
• తక్కువ రిస్క్ ఉన్న వ్యక్తులు పని చేస్తూనే ఉంటారు. లక్షణాల కోసం ఎప్పటికప్పుడు వారు వారి ఆరోగ్యాన్ని స్వయంగా పరీక్షించుకుంటారు. 
 
ఒకవేళ లక్షణాలు గమనించితే, పారా 5.2 లో సూచించిన విధంగా అనుసరించబడుతుంది.
 
• ఆరోగ్య సిబ్బందిలో కోవిడ్19 ను సూచించే లక్షణాలను గమనించినపుడు పాటించవలసిన ప్రామాణిక కార్యనిర్వాహక విధానాలు.
 
• ఎవరైనా ఆరోగ్య కార్యకర్తలో  కోవిడ్19 ను సూచించే సంకేతాలు మరియు లక్షణాలను గమనించినపుడు వెంటనే ఆ వ్యక్తిని ప్రత్యేకంగా ఉంచుతారు. ఈ క్రింది విధానాలను అనుసరిస్తారు.
 
- తేలికపాటి / చాలా తేలికపాటి / ప్రీ-సింప్టోమాటిక్ కేసుల విషయంలో అతడు / ఆమెకు హోమ్ ఐసోలేషన్ ఎంపిక కు అవకాశం కలిగిస్తారు.    
 
- హోమ్ ఐసోలేషన్ సాధ్యం కాని సందర్భాల్లో అటువంటి తేలికపాటి / చాలా తేలికపాటి / పూర్వ-రోగలక్షణ కేసులు కోవిడ్ సంరక్షణ కేంద్రంలో జాయిన్ చేయబడతారు.
 
- ఆక్సిజన్ చికిత్స అవసరమయ్యే మితమైన కేసులకు కోవిడ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆరోగ్య కేంద్రంలో ఉంచబడతారు.
 
- కోవిడ్ తో తీవ్రంగా బాధ పడుతున్న కేసులను కోవిడ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆసుపత్రిలో నిర్వహించబడతాయి
 
- ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న వైద్య సిబ్బంది కూడా అప్పుడప్పుడు కరోనా బారిన పడుతూ ఉంటారు. మరి  పిల్లలు పెద్దలు ఉన్న ఇంట్లో నుంచి బయటికి వస్తున్న మనం మరింత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా వైరస్ పేషెంట్లకు ఇచ్చే డైట్ వివరాలు... ఖర్జూరం, బాదంపప్పు, ఆంజీర్‌