Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా మృతదేహంలో 6గంటల తర్వాత వైరస్‌ ఉండదు

Advertiesment
కరోనా మృతదేహంలో 6గంటల తర్వాత వైరస్‌ ఉండదు
, శనివారం, 4 జులై 2020 (10:09 IST)
కరోనా మృతదేహంలో 6గంటల తర్వాత వైరస్‌ ఉండదని, కరోనా మృతుల అంత్యక్రియల్లో ఇబ్బందులు పెట్టొద్దని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్‌రెడ్డి సూచించారు. ఒక్క కరోనా మృతి ఉంటే 666 కేసులు ఉన్నట్టు లెక్క అని చెప్పారు.

అంతర్రాష్ట్ర రవాణా వల్ల పాజిటివ్‌ కేసుల సంఖ్య బాగా పెరిగిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఒకరి నుంచి 1.12 మందికి కరోనా సోకుతోందని, కరోనా వ్యాప్తి రెండు దాటితే మనం ప్రమాదంలో ఉన్నట్టేనని పేర్కొన్నారు. వైద్యలపై భారం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జవహర్‌రెడ్డి చెప్పారు.
 
ఆయన విలేఖరులతో మాట్లాడుతూ..."మార్చి 9వ‌ తేదీన తొలి కేసు రాష్ట్రంలో నమోదైంది. నాలుగు నెలలుగా కేసులు 16, 934 మందికి కరోనా సోకింది. పరీక్షలు నిర్వహించి కంటైన్మెంట్ చేస్తున్నాం. రాష్ట్రంలో మొత్తం 19 ల్యాబ్స్ ఉన్నాయి. 
 
47 ఆర్టీ పీసీఆర్ యంత్రాల ద్వారా 9 లక్షల 70 వేల పరీక్షలు చేశాము. మార్చి 24 వరకు 8 కేసులు. తొలి 21 రోజుల్లో 480 కేసులు, రెండో లాక్ డౌన్ లో, లాక్ డౌన్ 3లో 780 కేసులు., మర్కజ్ వల్ల అన్ లాక్ సమయంలో 13, 256 కేసులు వచ్చాయి. 
 
అంతర్రాష్ట్ర రవాణా వల్ల  కేసుల సంఖ్య బాగా పెరిగింది. వివిధ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి పై అధ్యయనం చేస్తున్నాం. బయట నుంచి ఏపీకి వచ్చిన వాళ్లు, అలాగే నిర్మాణ పనులు, వ్యవసాయ కూలీలు, కూరగాయల విక్రేతలు, ఆరోగ్య, సానిటరీ, పోలీసు సిబ్బందికి పరీక్ష చేస్తున్నాం.
 
వ్యవసాయ కేసుల్లో పాజిటివిటీ 1.15 ఉంది. నిర్మాణ రంగంలో 5.2 శాతం ఉంది. ఆరోగ్య సిబ్బంది 12 ,500 మందిని పరిక్ష చేస్తే 1.15 శాతం మందికి కరోనా వచ్చింది. 20 వేల వలస  కార్మికుల ను పరీక్ష చేస్తే వారికి కూడా 4 శాతం వరకు ఉంది. రైళ్ల ద్వారా వచ్చిన వారిని కూడా రాండంగా పరీక్ష చేస్తున్నాం.
 
హోల్ సెల్ మార్కెట్లు కూడా వైద్య ఆరోగ్యశాఖ పరీక్ష చేసింది. దుకాణదారులు, దేవాలయాల్లో కూడా నిత్యం పరీక్షలు చేస్తున్నాం. దుకాణ దారులు, కూరగాయల మార్కెట్లు లో విక్రేతల ద్వారా ఎక్కువ మందికి సోకె అవకాశం ఉంది. అందుకే జాగ్రత్తలు తీసుకుంటున్నాము.
 
40 ఏళ్ల పైబడిన వారిలో కరోనా మరణాల శాతం ఎక్కువ ఉంది. కోమార్బైడ్ పరిస్థితి కారణంగా ఇది ఎక్కువ ఉంటోంది. పల్స్ ఆక్సీ మీటర్ల ద్వారా ను పరిక్ష చేస్తున్నాం. నడక ద్వారా పరిక్ష చేసి హైరిస్కు కేసులను గుర్తిస్తున్నాం.
 
ఎంత తొందరగా కేసులు గుర్తిస్తే అంత ఎక్కువగా ప్రాణాలు కాపాడే అవకాశం ఉంది. 48 గంటలు దాటిన తర్వాత గుర్తిస్తే ప్రమాదం ఎక్కువ ఉంటోంది. ఆస్పత్రుల్లో రోగుల భారం తగ్గించేదుకు ఇంటి వద్దే ఐసోలేషన్  చేస్తున్నాం. టెలి సలహా ద్వారా వైద్యులు లక్షణాలు తక్కువ ఉన్నవారికి మందులు సూచిస్తున్నారు.
 
అందరికి క్రిటికల్ కేర్ అవసరం లేదు. 4 నెలలుగా నిరంతరాయంగా పని చేస్తున్న వైద్యుల పై భారం తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాము. కొత్త వారి నియామకం జరుగుతోంది. పరీక్షలు కూడా వికేంద్రీకరణ చేశాం.
 
కొన్ని ప్రైవేటు అస్పత్రులల్లో కోవిడ్ చికిత్స కు త్వరలోనే అనుమతి ఇస్తాం. అక్కడ వసూలు చేసే ధరల విషయం లో నియంత్రణ ఉంటుంది. ఇప్పటికే ఆరోగ్య శ్రీ ద్వారా కూడా ధరలు సూచించాము.  ప్రస్తుతం రాష్ట్రంలో ఒకరి నుంచి 1.12 మందికే కరోనా సోకుతోంది. ఇది రెండు దాటితే మనం ప్రమాదంలో ఉన్నట్టే" అని పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనాకు మెడిసిన్ కనుగొనేలా ఆశీర్వదించమని కోరా: విజయసాయిరెడ్డి