Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రేపు ఏపి ఎన్జీవో వెబ్‌సైట్ ప్రారంభం

రేపు ఏపి ఎన్జీవో వెబ్‌సైట్ ప్రారంభం
, సోమవారం, 23 నవంబరు 2020 (07:03 IST)
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలు, డీఏ మంజూరు, బకాయి ఉన్న జీతాలు చెల్లింపు, సి.పి.ఎస్. రద్దు వంటి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఏ.పి. ఎన్టీవో రాష్ట్ర సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్. చంద్రశేఖర్ రెడ్డి, బండి శ్రీనివాసరావులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఉద్యోగుల సమస్యల పరిష్కారం ఏ.పి. ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర వెబ్‌సైట్ ప్రారంభం వంటి అంశాలపై ఆదివారం విజయవాడలోని ఏపి ఎన్జీవో హోంలో చంద్రశేఖర్ రెడ్డి, బండి శ్రీనివాసరావు, ఇతర సంఘ నాయకులతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న 11వ పీఆర్సీని వెంటనే అమలు చేయాలన్నారు.

పి.ఆర్.సి. కమిటీ నివేదిక ఇచ్చినప్పటికి అమలుపై చర్యలు తీసుకోపోవడం పట్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఇప్పటికే 25 నెలలు కాలయాపన జరిగిందన్నారు. కరోనా సమయంలో మార్చి, ఏప్రిల్ నెలలో నిలిపివేసిన జీత భత్యాలను చెల్లించేందుకు కూడా చర్యలు తీసుకోవాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతల డి.ఎ.లు చెల్లించేందుకు ఉత్తర్వులు ఇచ్చినప్పటికి బకాయి ఉన్న మరో మూడు విడతల డిఎలను కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం సరికాదని దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచన చేయాలన్నారు.

సి.పి.ఎస్. రద్దుచేస్తానన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేసి ఉద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించడం, మహిళా ఉద్యోగులకు ఐదు రోజులు ప్రత్యేక క్యాజువల్ లీవు మంజూరు, జి.పి.ఎఫ్., ఏ.పి.జి.ఎల్.ఐ. చెల్లింపులను సకాలంలో చెల్లించడం, పెన్షనరు బెనిఫిట్స్ వంటి ప్రధాన డిమాండ్లను నెరవేర్చే దిశలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

ఏ.పి.ఎన్జీవోస్ అసోసియేషన్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలను కడపలో నిర్వహించాలని రాష్ట్ర సంఘం నిర్ణయం తీసుకోవడం జరిగిందని, దీనికి ముఖ్యమంత్రి ముఖ్య అతిధిగా హాజరైయ్యేందుకు సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు. కరోనా తగ్గుముఖం పట్టిన వెంటనే కౌన్సిల్ సమావేశాలను నిర్వహిస్తామన్నారు. 

రాష్ట్ర ప్రధానకార్యదర్శి బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏ.పి. ఎన్జీవో అసోసియేషన్ గత 70 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఎన్టీవో సమాచారం మాస పత్రికను నిర్వహిస్తూ ఉద్యోగులకు కావాల్సిన సమాచారాన్ని మాత్రమే అందిస్తుందని తెలిపారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా ఉద్యోగులకు అవసరమైన సమాచారాన్ని తక్షణం అందించేందుకు నూతన వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 24న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌రై వెబ్‌సైట్‌ను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.

ఈ వెబ్ సైట్ ద్వారా తాలూకా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యోగ సంఘాలకు సంబంధించిన సమాచారంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొనుచున్న డిపార్టుమెంట్ టెస్టులకు సంబంధించిన సమాచారాన్ని వెబ్‌సైట్‌లో పొందుపరచి ఉద్యోగులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని వారికి రావాల్సిన బకాయిలు సకాలంలో చెల్లించాలనే న్యాయమైన కోర్కెలు మాత్రమేనని దీనిని ప్రభుత్వం సానుకూలమైన దృక్పదంతో పరిష్కరించాలని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీని వణికిస్తున్న చలి