Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అలిపిరి శ్రీ ల‌క్ష్మీ నారాయ‌ణ‌స్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు

Advertiesment
అలిపిరి శ్రీ ల‌క్ష్మీ నారాయ‌ణ‌స్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు
, ఆదివారం, 22 నవంబరు 2020 (19:20 IST)
తిరుప‌తి అలిపిరి పాదాల మండ‌పం వ‌ద్ద గ‌ల శ్రీ ల‌క్ష్మీ నారాయ‌ణ‌స్వామివారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ వైదిక కార్యక్రమాలు ఆదివారం శాస్త్రోక్తంగా జ‌రుగుతున్నాయి. సోమ‌, మంగ‌ళ‌వారాల్లో యాగ‌శాల‌లో వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.
 
ఇందులో భాగంగా ఉద‌యం 9 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు మూల‌వ‌ర్ల‌కు పంచ గ‌వ్యాధివాసం, యాగ‌శాల కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. కాగా సాయంత్రం 5.30 నుండి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు ఉక్త హోమాలు, వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు.  
 
న‌వంబ‌రు 25వ తేదీ బుధ‌వారం ఉద‌యం 7.30 నుండి 9 గంట‌ల వ‌ర‌కు హోమాలు, ఉద‌యం 9 నుండి 10.30 గంట‌ల మ‌ధ్య మ‌హా పూర్ణాహూతి,  ధ‌నుర్ ల‌గ్నంలో  శ్రీ ల‌క్ష్మీ నారాయ‌ణ స్వామి, ప‌రివార దేవ‌త‌ల‌కు కుంభ‌ర్చాన, విమాన సంప్రొక్షణ జ‌రుగుతుంది.  
 
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు‌, వైఖాన‌స ఆగ‌మ స‌ల‌హాదారులు సుంద‌ర‌వ‌ర‌ద భ‌ట్టాచార్యులు, కంక‌ణ‌భ‌ట్టార్ ముర‌ళి కృష్ణ ఆచార్యులు, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ‌నివాసులు, అర్చ‌కులు, అధికారులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

341వ రోజుకు రైతుల నిరసన దీక్షలు