Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీ మీదపడి చిన్నారి మృతి... ఎక్కడ?

Webdunia
ఆదివారం, 5 సెప్టెంబరు 2021 (10:00 IST)
కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న సంఘటనలో ప్రాణాలు తీస్తుంటాయి. అదీకూడా అత్యంత సురక్షితంగా ఉండే మన ఇళ్ళలోనే ఇలాంటి విషాదకర సంఘటనలు జరుగుతుంటాయి. తాజాగా ఇంట్లో టేబుల్‌పై ఉన్న టీవీ మీదపడి 11 నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన కృష్ణా జిల్లా నందిగామ మండలం పాత కంచల గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన చలమల నాగేశ్వరరావు, సౌందర్య దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. వారిలో చిన్న కుమార్తె కీర్తి (11 నెలలు) శనివారం ఇంట్లో టీవీ ముందు కూర్చుంది. ఆ సమయంలో తల్లిదండ్రులు ఇంటి బయట ఉన్నారు. 
 
చిన్నారి టీవీ పక్కనే ఉన్న కేబుల్‌ తీగ లాగడంతో టీవీ ఆమెపై పడింది. వెంటనే గమనించిన తల్లిదండ్రులు పాపను ఐతవరం గ్రామంలోని ఓ ఆర్‌ఎంపీ వద్దకు తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందింది. త్వరలో తొలి పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించాలని భావిస్తున్న తరుణంలో పాప అనంత లోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. 

సంబంధిత వార్తలు

అంజలి బహిష్కరణ చేసింది ఎవరిని?

సినిమా రంగంలో సవాళ్లు నేపథ్యంగా ఇట్లు... మీ సినిమా

అనుపమ పరమేశ్వరన్ నటిసున్న పరదా లో దర్శన రాజేంద్రన్ పరిచయం

ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిన వారిని ఫెయిల్యూల్ నటులు అంటారు : వితిక సందేశ్

ఆడువారు మాటలకు అర్థాలే వేరులే - వర్మ మాటలు నీటిమూటలేనా !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments