పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అభిమానిపై కొందరు వ్యక్తులు దాడిచేశారు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున సందర్భంగా గురువారం సాయంత్రం కృష్ణా జిల్లా నందిగామ అనాసాగరంలో పుట్టిన రోజు వేడుకలు జరిగాయి.
ఈ వేడుకలు పూర్తయిన తర్వాత ఆ వీరాభిమాని గోపి పుట్టినరోజు వేడుకల కోసం ఉపయోగించి బల్లపైన నిద్రిస్తున్నాడు. ఆ సమయుోబ ఐదుగురు వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని గోపి ఆరోపిస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.