Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొండపల్లి ఎన్నికల్లో ఉద్రిక్తత - రెండో రోజూ వాయిదా

Webdunia
మంగళవారం, 23 నవంబరు 2021 (13:04 IST)
కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. తొలి రోజున ఎన్నిక జరుగకుండా అడ్డుకున్న అధికార వైకాపా నేతలు.. రెండో రోజైన మంగళవారం కూడా ఈ ఎన్నిక జరుగకుండా అడ్డుకున్నారు. దీంతో ఛైర్మన్ ఎన్నిక మరోమారు వాయిదాపడింది. దీంతో మున్సిపల్ కార్యాలయంలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్టు రిటర్నింగ్ అధికారి వాయిదా వేశారు. 
 
ఈ ఎన్నికల్లో అధికార వైకాపా సభ్యుల కంటే ప్రతిపక్ష టీడీపీకి ఒక్క సభ్యుడు అదనంగా ఉన్నారు. దీంతో ఛైర్మన్ గిరి టీడీపీకి దక్కుంది. అలా కాకుండా ఉండేందుకు అధికార పార్టీ నేతలు ఎన్నిక జరుగకుండా అడ్డుకుంటున్నారు. ఎన్నికను ప్రజాస్వామ్య బద్ధంగా నిర్వహించి ఛైర్మన్‌ను ఎన్నుకోవాలంటూ కోరారు. 
 
మరోవైపు, టీడీపీ నేతలు వైకాపా నేతలపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా, ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్, జోగి రమేశ్‌ల కన్నుసన్నల్లో వైకాపా సభ్యులు నినాదాలు చేస్తూ ఎన్నిక సక్రమంగా జరుగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాలో ఉన్న అహంకారం రాలి పడింది : కోట శ్రీనివాస్ జ్ఞాపకాలు

డాకు మహారాజ్ నుంచి సుక్క నీరు లిరిక్ విడుదలచేశారు

సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ కు మరింత వినోదం వుండేలా డిజైన్ చేస్తా : అనిల్ రావిపూడి

కెరీర్ లో యాక్షన్ టచ్ తో కామెడీ ఫిల్మ్ లైలా: విశ్వక్సేన్

తమ్ముడితో సెటిల్ చేస్తా.. మరి నాకేంటి అని అన్నయ్య అడిగారు? శ్రీసుధ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

Winter Water: శీతాకాలం.. నీళ్లు తాగుతున్నారా..? పిల్లలకు వేడి నీళ్లు తాగిస్తే..?

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments