Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేను నా కుర్చీవ‌దిలితే అంతే - బాల‌కృష్ణ‌తో జ‌న‌వ‌రిలో సినిమా- అనిల్‌ రావిపూడి

webdunia
మంగళవారం, 23 నవంబరు 2021 (08:47 IST)
Anil Ravipudi
దర్శకుడు అనిల్‌ రావిపూడి సినిమాలు సెప‌రేట్‌. వినోదాన్ని పండించే క‌థ‌లు ఆయ‌న రూటు. మ‌హేష్‌బాబుతో స‌రిలేరు నీకెవ్వ‌రూ సినిమా క‌థ సీరియ‌స్ అయినా వినోదంతో దాన్ని గ‌ట్టెంక్కించాడు. సీరియ‌స్‌గా చెబితే ప్రేక్ష‌కులు క‌నెక్ట్ కార‌నేది ఆయ‌న నైజం. తాజాగా ఎఫ్‌3 సినిమా తీస్తున్నారు. ఇందులోనూ ఎఫ్‌2 లోని న‌టీన‌టులే న‌టించినా క‌థాంశం డ‌బ్బు. అది ఏమిట‌నేది సినిమా చూడాల్సిందే అంటున్నారు అనిల్‌. ఈరోజు అన‌గా మంగ‌ళ‌వారం ఆయ‌న పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ప‌లు విష‌యాలు తెలియ‌జేశారు.
 
 
- ఎఫ్‌2 అనేది నా బ‌యోపిక్ అని అప్ప‌డే చెప్పా. పెళ్ళ‌య్యాక అంద‌రి లైఫ్‌లో జ‌రిగే సంఘ‌ట‌న‌లు ఇలానే వుంటాయి. దాన్ని వినోదంగా మార్చాను. ఎప్‌3 కూడా నాకు జ‌రిగిన అనుభ‌వాల‌తోనే తీశాను. ఇది కూడా వ‌య‌స్సుతో సంబంధంలేకుండా అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంది. ఫన్‌, ఫ్రస్ట్రేషన్‌ లాంటి అంశాల్ని తీసుకుని ఓ ఫ్రాంచైజీగా తీర్చిదిద్దడమే ఓ ప్రత్యేకమైన అంశం. ముందుముందు ఎఫ్ 4, 5 కూడా వ‌స్తుందేమో చెప్ప‌లేను.
 
- ఈ సినిమా షూట్‌లో చాలా మంది ఆర్టిస్టుల‌తో ప‌నిచేయాల్సివ‌చ్చింది. క్ల‌యిమాక్స్‌తో దాదాపు 35మంది ఆర్టిస్టులతో చేయాలి. వాళ్ళ‌ని మెనేజ్ చేయ‌డంతో అల‌సిపోయాను కూడా. అప్పుడు నాకు ఇ.వి.వి. స‌త్య‌నారాయ‌ణ‌గారు గుర్తుకు వచ్చారు. అంత మంది నటుల్ని ఆయన ఎలా హ్యాండిల్‌ చేసేవారో అనిపించింది. ఎందుకంటే అంత‌మందిలో హీరోయిన్లు, హీరోలు, కేరెక్ట‌ర్ ఆర్టిస్టులు వీరందిరీ డేట్స్ ఒక్కోసారి క్లాష్ అయ్యేవి. వారిని సెట్ చేయ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డాల్సివ‌చ్చింది.
 
- ఈరోజు నేను ఎఫ్‌3 సినిమా షూట్‌లోనే వున్నా. సినిమా పూర్త‌వుతుంది. కానీ సంక్రాంతికి రావడం లేదనే కొంచెం నిరుత్సాహంగా అనిపించింది. ‘ఎఫ్‌2’, ‘సరిలేరు నీకెవ్వరూ’ వరుసగా సంక్రాంతికే విడుదలయ్యాయి. 
 
- ఎఫ్ 3లో మేనరిజమ్స్‌ కోసమని ప్రత్యేకంగా సంభాషణలేమీ రాయలేదు కానీ, ఆయా పాత్రలు చేసే పనులు బాగా నవ్విస్తాయి. వెంకటేష్‌ రేచీకటి బాధితుడిగా, వరుణ్‌ నత్తిగా మాట్లాడే కుర్రాడిగా కనిపిస్తారు. అక్కడక్కడా అలా కనిపించినా ప్రేక్షకులు మాత్రం బాగా నవ్వుకుంటారు. వాళ్లిద్దరికే కాదు, ప్రతి పాత్రకీ ప్రాధాన్యం ఉంది. ఇప్పటికే 80 శాతం చిత్రీకరణ పూర్తయింది.
 
- నేను బాలీవుడ్‌కు వెళ్ళే ఆలోచ‌నే లేదు. టాలీవుడ్‌లోనే బాగుంది. నాకంటూ సెప‌రేట్ కుర్చీవుంది. నేను లేచానంటే ఆ గేప్‌లో ఎవ‌రో ఒక‌రు కూర్చుంటారు. (న‌వ్వుతూ). అప్పుడు నా ప‌రిస్థితి ఏమిటి? అందుకే నేను వెల్ళ‌ను. 
 
- దిల్‌రాజు నిర్మాత‌గా న‌న్ను పెద్ద‌గా అడిగింది లేదు. నామీద పూర్తి భారం మోపారు. ఎప్పుడైన ఎక్క‌డైనా క‌న‌బ‌డితే ఓ సీన్ గురించి చెబుతా. అంతే. ఈ సినిమాకు నా రెమ్యున‌రేష్ కూడా పెంచారు. బాగానే ఇచ్చారు. సొంత ఇల్లు కొనుకున్నా.
 
- ఇక త‌దుప‌రి బాల‌కృష్ణ‌తో సినిమా చేస్తున్నా. అది జ‌న‌వ‌రిలో మొద‌లవుతుంది. బాల‌య్య‌బాబుకు ఇలా వినోదం లా చెబితే జ‌నాలు చూడ‌రు. ప‌టాస్ లాంటి రూటులోనే వైవిధ్య‌మైన క‌థ‌ను చెప్ప‌బోతున్నా. ఇప్ప‌టికే ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. డిసెంబ‌ర్‌లో ఓప‌న్ చేసి జ‌న‌వ‌రిలో షూట్ మొద‌లు పెడ‌తాం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దంగల్ బ్యూటీ ఫాతిమాతో అమీర్ ఖాన్ పెళ్లి..?