వెంకటేష్ భిన్నమైన వ్యక్తి. సినిమాలు చేస్తూనే ఆథ్యాత్మికంగా ఎక్కువ టైం కేటాయిస్తారు. అందరికీ అంత రిలాక్స్ వుండకపోవచ్చు కానీ తాను మాత్రం దానికోసం టైం కేటాయిస్తానని తెలియజేశారు. హిమాలయాలకు వెళితే ఆ చుట్టుపక్కల ప్రముఖులు కాలుమోపిన ప్రాంతాలలో పర్యటించి కాసేపు థ్యానం చేసి వస్తానని వెల్లడించారు కూడా.
వెబ్ దునియాతో ఆయన మాట్లాడుతూ, హిమాలయాల్లో చాలా ప్రశాంతంత వుంటుంది. అక్కడనుంచి వచ్చాక ఏదో తెలీని శక్తి మనల్ని ఆవహించినట్లుంటుంది. ఇక్కడకు వచ్చి ఏదైనా చెబితే ఏదో చెబుతాడు. పనీపాటా వుండదు. ఇతనికి సరిపోతుంది. మరి మాకు ఎలా అంటూ ఎదుటివారు అనుకోవడం నాకు తెలుస్తుంది అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
కరోనా వచ్చినా మారలేదు
కరోనా అనంతరం పరిస్థితులును ఆయన గమనిస్తూ ఇలా అన్నారు. జీవితం చాలా చిన్నది. ఇంకా ఎవ్వరూ మారడం లేదు. ఫస్ట్ లాక్డౌన్ సమయంలో జనాలు మాకేం వద్దు అన్నారు. ఓన్లీ కాస్త ఫుడ్, మంచి నిద్ర, కుటుంబంతో కలిసి వుండడం. ఎదుటివారికి అవసమైతే సాయం చేయడం. సింపుల్ లివింగ్ అన్నారు. కానీ రానురాను అది మర్చిపోయారు. ఇప్పుడంతా మళ్లీ మొదటికి వచ్చింది. అన్నీ తమకే కావాలన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారు. పక్కవారు ఏం చేస్తారు.. వారు ఇలా ఉన్నారు అలా ఉన్నారు అని ఆలోచించడం ఎందుకు. మనం కరెక్ట్‌గా వున్నామా లేదా అనేది ఆలోచించాలి. అందరితో మంచిగా ఉంటే సరిపోతుంది కదా.
దేవుడు ఎంత కావాలో అంతే ఇస్తాడు
మనం ఏదీ ఎక్కువ ఆశించకూడదు. మనకు అది రాలేదు. ఇది రాలేదు అని బెంగపడకూదు. మనకు దక్కాల్సింది దక్కుతుంది. ఎక్కువగా ఏమీ ఆశించొద్దు. వచ్చిన దాన్ని స్వీకరించాలి. ఫీడ్ బ్యాక్ అనే దాంట్లో ప్లస్, మైనస్‌లుంటాయి. హిట్ అయినా ఫ్లాప్ అయినా ఎక్కువగా రియాక్ట్ అవ్వకూడదు. కానీ ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకుని పాఠాలు నేర్చుకోవాలి. అంటూ హితవు పలికారు.