Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెదేపా బీ ఫామ్‌ను జేబులో పెట్టుకుని జగన్‌ను కలిసిన ఘనత ఆదాలది : కోటంరెడ్డి

Webdunia
గురువారం, 9 ఫిబ్రవరి 2023 (12:06 IST)
తెలుగుదేశం పార్టీ ఇచ్చిన బీ ఫామ్‌ను జేబులో పెట్టుకుని వైకాపా టిక్కెట్ కోసం ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలిసిన ఘనత నెల్లూరు వైకాపా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిది అని నెల్లూరు రూరల్ వైకాపా రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఇలాంటి వ్యక్తులు తన గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి వద్ద కోట్లాది రూపాయల నగదు ఉండొచ్చు.. కానీ తన వద్ద మాత్రం విలువైన నియోజకవర్గ ప్రజల అభిమానం ఉందని ఆయన చెప్పారు. 
 
గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన బీ ఫామ్‌‍‌ను జేబులో పెట్టుకుని జగన్‌ను కలిసిన ఘనత ఆదాలదని, అలాంటి వ్యక్తి తన గురించి మాట్లాడేది అని ఎద్దేవా చేశారు. టీడీపీ ఫామ్‌ను జేబులో పెట్టుకుని చంద్రబాబును కలవడానికి వెళ్తున్నానని చెప్పి, అక్కడ నుంచి నేరుగా జగన్‌ వద్దకు వెళ్లానని విమర్శించారు. 
 
పులివెందుల రౌడీ జగన్.. నెల్లూరు రౌడీ కోటంరెడ్డి అని గతంలో ఆదాల చేసిన విమర్శలు అందరికీ గుర్తున్నాయని చెప్పారు. ఇలాంటి వైకాపాలోనే కొనసాగుతారనే నమ్మకం తనకు లేనట్టుగా కోటంరెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ఒకే పార్టీలో ఉండాలని గతంలో మాదిరి అని పార్టీలు తిరగొద్దదని ఎద్దేవా చేశారు. 
 
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తాను కేంద్ర హోం శాఖ ఫిర్యాదు చేశాని, తన మాదిరే వైకాపా ప్రభుత్వం కూడా విచారణను ఎందుకు కోరడం లేదని కోటంరెడ్డి ప్రశ్నించారు. కేంద్ర సంస్థలు విచారణ జరిపితే తన మాదిరే ఇంకెంత మంది ఫోన్లు ట్యాప్ అయ్యాయనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. నెల్లూరు మేయర్ సహా 11 మంది కార్పొరేటర్లు తన వెంట ఉన్నారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments