Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపాకు మరో గట్టి షాక్.. కిల్లి కృపారాణి రాజీనామా!

ఠాగూర్
బుధవారం, 3 ఏప్రియల్ 2024 (14:44 IST)
ఏపీలో అధికార వైకాపాకు మరో గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ మహిళా నేత, మాజీ ఎంపీ కిల్లి కృపారాణి వైకాపాకు రాజీనామా చేశారు. వైకాపాలో తనకు  కనీస గౌవరం లేదని, సీఎం జగన్ తనను మోసం చేశారంటూ ఆరోపించారు. తనకు పదవుల కంటే ఆత్మగౌరవం ముఖ్యమని అందుకే ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. గత 2019 ఎన్నికలకు ముందు ఆమె వైకాపాలో చేరారు. ఎంపీ టిక్కెట్ ఆశించి జగన్ పంచన చేరిన ఆమెకు... టిక్కెట్ కేటాయించలేదు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అయినా తన పట్ల జగన్ కరుణ చూపుతారని ఆమె భావించారు. కానీ, ఆమెకు మళ్లీ మొండి చేయి చూపించారు. దీంతో ఆమె తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. పార్టీకి రాజీనామా చేశారు. 
 
ఈ సందర్భంగా కిల్లి కృపారాణి మాట్లాడుతూ, తనకు కేబినెట్ స్థాయి పదవి ఇస్తానని జగన్ మోసం చేశారని చెప్పారు. తనకు పార్టీలో కనీస గౌరవం కూడా దక్కలేదని వాపోయారు. పదవుల కంటే తనకు వ్యక్తిగత గౌరవమే ముఖ్యమని తెలిపారు. తనకు గౌరవం ఎక్కడుంటే అక్కడకు వెళ్తానని చెప్పారు. కాగా, కిల్లి కృపారాణి మళ్లీ మాతృపార్టీ అయిన కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు ప్రచారం సాగుతుంది. 
 
హిస్టరీలో ఫస్ట్ టైమ్ :: 151 సీట్లు వచ్చినోడ్ని ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి బిత్తరపోయేలా చేస్తున్నారు..!! 
 
చరిత్రలో మొట్టమొదటిసారి ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకోనుంది. గత ఎన్నికల్లో ఏకంగా 151 అసెంబ్లీ సీట్లు గెలుచుకుని, ఐదేళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని తాను పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయి, కనీసం ఒక్క చోటు కూడా ఎమ్మెల్యేగా గెలవలేని వ్యక్తి ఇపుడు బిత్తరపోయేలా చేస్తున్నాడు. ఆ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి కాగా, ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి పవన్ కళ్యాణ్. 
 
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్‌ను ఎలాగైనా ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో అధికార వైకాపా నేతలతో పాటు ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిలు ఉన్నారు. ఇందుకోసం ఇంతకాలం కాపు కులానికి పెద్దగా ఉన్న ముద్రగడ పద్మనాభంను వైకాపాలోకి చేర్చుకున్నారు. ఈయన ద్వారా కాపు ఓట్లను గుంపగుత్తంగా వైకాపాకు పడేలా చూసుకుని పవన్‌ను ఓడించాలని వ్యూహం రచించాడు. అది వర్కౌట్ కాలేదు. దీంతో రూ.500 కోట్లు ఓటర్లకు పంచి ఓడించేందుకు ప్లాన్ చేసినట్టు ప్రచారం జరిగింది. 
 
అయితే, పవన్ కళ్యాణ్ పట్ల పిఠాపురం ప్రజలకు ఉన్న అభిమానాన్ని డబ్బుతో కొనుగోలు చేయలేమని కోడి కూయకముందే అర్థమైంది. ఆ తర్వాత మండలానికో మంత్రిని, గ్రామానికో ఓ ఎమ్మెల్యేను ఇన్‌చార్జ్‌లు నియమించారు. కానీ క్షేత్రస్థాయిలో పవన్ కళ్యాణ్ పట్ల ఉన్న ప్రజా స్పందనను చూసి ఓర్వలేకపోయారు. దీంతో ఇపుడు డమ్మీ ఈవీఎంలను వైకాపా నేతలు నమ్ముకున్నారు. జగన్ స్టిక్కర్లు, ఇతర సామాగ్రి, డమ్మీ ఈవీఎంలను తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు గుర్తించి, అందులోని ఈవీఎంలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mega Heros: మెగా హీరోలకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను : విజయ్ కనకమేడల

Yash; రామాయణంలో రామ్‌గా రణబీర్ కపూర్, రావణ్‌గా యష్ షూటింగ్ కొనసాగుతోంది

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి పిలిస్తేనే వచ్చాను.. పార్టీలో కలిశాను.. ఇషా

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments