Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మాజీ సీఎం కేసీఆర్ కుడిభజం పోయింది.. పూర్వ పార్టీలోకి వెళుతున్న బీఆర్ఎస్ కీలక నేత!

kcr - kk

వరుణ్

, శుక్రవారం, 29 మార్చి 2024 (09:51 IST)
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శిగా ఉన్న కె.కేశవ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. భారాస నుంచి వీడి తన పూర్వ పార్టీ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు ప్రకటించారు. తన కుమార్తె, హైదరాబాద్ నగర మేయర్‌తో కలిసి హస్తం పార్టీలో చేరుతున్నట్టు ప్రటించారు. ఆయన మాజీ సీఎం కేసీఆర్‌తో భేటీ అనంతరం మీడియా ముఖంగా ఈ ప్రకటన విడుదల చేశారు. దీంతో లోక్‌సభ ఎన్నికలకు ముందు భారత రాష్ట్ర సమితికి కోలుకోలేని గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్నికలకు ముందు అనేక మంది కీలక నేతలు పార్టీని వీడటం మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు ఆ పార్టీ నేతలను తీవ్రమైన కలవరపాటుకు గురిచేస్తుంది. 
 
తన కూతురు, హైదరాబాద్ మేయర్ జి.విజయలక్ష్మితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు కేకే గురువారం రాత్రి ప్రకటించారు. తన నివాసం వద్ద మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. కేసీఆర్ తనకు చాలా గౌరవం ఇచ్చారని, ఆయనపై తనకూ గౌరవం ఉందని కేకే ఈ సందర్భంగా కేకే అన్నారు. రాజకీయ విరమణ దశలో ఉన్న తాను తిరిగి తన పూర్వపార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. 84 ఏళ్ల వయసులో తిరిగి కాంగ్రెస్‌కి వెళ్లాలనుకుంటున్నానని, తీర్థయాత్రలకు వెళ్లిన వారు ఎప్పటికైనా తిరిగి ఇంటికే చేరతారని, తాను కూడా తన సొంత ఇల్లులాంటి కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్నానని కేశవరావు తెలిపారు. తాను సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని, ఆ పార్టీ తనకు అన్ని అవకాశాలు ఇచ్చిందని అన్నారు. 
 
తాను పుట్టింది.. పెరిగింది.. కాంగ్రెస్లోనేనని అన్నారు. తెలంగాణ ఉద్యమ నాటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ చేరానని కేకే అన్నారు. తాను ఆశించినట్టుగానే తెలంగాణ సిద్ధించిందని, కాంగ్రెస్ పార్టీనే తెలంగాణ కోరికను నెరవేర్చిందని అన్నారు. 53 ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేశానని, బీఆర్ఎస్ పదేళ్లే పని చేశానని అన్నారు. కాంగ్రెస్ ఎప్పుడు చేరుతాననే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తానని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తనకు బాగా సహకరించారని, ప్రస్తుతం తాను రాజకీయ విరమణ దశలో ఉన్నానని, బీఆర్ఎస్ యువతకు మరిన్ని అవకాశాలు రావాలని అన్నారు.
 
కాగా గురువారం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్‌లో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో కేకే భేటీ అయ్యారు. ఇరువురి భేటీపై కేకేపై కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టుగా మీడియా కథనాలు వెలువడ్డాయి. కేసీఆర్‌తో భేటీ అనంతరం కేకే తన నివాసానికి వెళ్లారు. పార్టీ మారబోతున్నట్టు మీడియా సమావేశంలో వెల్లడించారు. బీఆర్ఎస్‌కు సంబంధించిన విషయాలపై కేసీఆర్‌తో మాట్లాడానని అన్నారు. కవిత అరెస్టుపై కూడా చర్చించుకున్నామని, ఆమెను అక్రమంగా అరెస్టు చేశారని వ్యాఖ్యానించారు. పార్టీ అంతర్గత విషయాలపైనా చర్చ జరిగిందని ప్రస్తావించారు. బీఆర్ఎస్‌నే కొనసాగాలని తన కుమారుడు విప్లవ్ తీసుకున్న నిర్ణయం మంచిదేనని ఈ సందర్భంగా కేకే ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వలసలతో ఉక్కిరిబిక్కిరవుతున్న బీఆర్ఎస్‌కు మరో షాక్... పోటీ నుంచి తప్పుకున్న కడియం కావ్య!!