Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విస్తారాలో ముదురుతున్న సంక్షోభం... మరో 15 మంది సీనియర్ పైలెట్ల రాజీనామా!!

vistara

ఠాగూర్

, బుధవారం, 3 ఏప్రియల్ 2024 (11:04 IST)
విస్తారా ఎయిర్‌లైన్స్ సంస్థ సంక్షోభం తారా స్థాయికి చేరేలా కనిపిస్తుంద. ఇప్పటికే కొందరు పైలెట్లు రాజీనామాలు చేయగా, తాజాగా మరో 15 మంది సీనియర్ పైలెట్లు రాజీనామాలు చేశారు. దీంతో ఆ సంస్థకు చెందిన విమానాలు వరుసగా రెండో రోజు కూడా 50కి పైగా సర్వీసులు రద్దు అయ్యాయి. విస్తారా విమానాల రద్దుతో ప్రయాణికులు సైతం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఈ అంశంపై డీజీసీఏ సీరియస్ అయింది. రోజువారీ నివేదికను ఇవ్వలంటా విస్తారా ఎయిర్‌లైన్స్ సంస్థను ఆదేశించింది.
 
ఎయిర్ ఇండియాలో విలీనం దిశగా విస్తారా విమాన సంస్థ యాజమాన్యం అడుగులు వేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆ సంస్థలో సంక్షోభం చెలరేగింది. వీటిని ఆ సంస్థ యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకే సాగుతుంది. విలీనం అంటూ జరిగితే వేతనాల విషయంలో తమకు అన్యాయం జరుగుతుందని పైలెట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో కొంతమంది, తాజాగా మరో 15 మంది రాజీనామాలు చేశారు. 
 
దీంతో అనేక విమానాల సర్వీసులు రద్దు అవుతున్నాయి. ఈ రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. తాము పడిన ఇబ్బందులను సోషల్ మీడియా వేదికగా ఏకరవు పెడుతున్నారు. దీంతో స్పందించిన కేంద్ర పౌర విమానయాన సంస్థ ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తోంది. మరోవైపు, విమాన సర్వీసులు జాప్యం, రద్దుకు సంబంధించిన సమాచారంతోపాటు, ఇతరత్రా వివరాలపై రోజువారీ నివేదికను సమర్పించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విస్తారాను ఆదేశించింది.
 
ఎయిర్ ఇండియాలో విలీనం దిశగా అడుగులు వేస్తున్న విస్తారా వేసవి నేపథ్యంలో రోజుకు 300కు పైగా విమానాలు నడుపుతున్నది. వేతనాల విషయంలో అన్యాయం జరుగుతోందంటూ సీనియర్ పైలట్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 15 మంది రాజీనామా చేయడంతో గందరగోళం నెలకొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత మార్కెట్లోకి Tecno Pova 6 Pro 5G.. స్పెసిఫికేషన్స్ ఇవే