Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొత్త అదాయపన్ను విధానంలో మార్పులు.. కేంద్రం క్లారిటీ!!

Income Tax

ఠాగూర్

, సోమవారం, 1 ఏప్రియల్ 2024 (15:52 IST)
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం 2024-25 ప్రారంభమైంది. ఈ కొత్త యేడాదిలో పలు కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అయితే, ఆదాయ పన్ను కొత్త విధానానికి సంబంధించి తప్పుదారిపట్టించే సమాచారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. ముఖ్యంగా, కొత్త ఆదాయ పన్ను శ్లాబుల్లో మార్పులు వస్తున్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం చక్కర్లు కొడుతుంది. దీనిపై కేంద్రం స్పందించింది. కొత్త పన్ను విధానంలో తలెత్తిన అనుమానాలను నివృత్తి చేస్తూ పలు కీలకాంశాలను ఎక్స్ ఖాతాలో వివరణ ఇచ్చింది. 
 
ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే, 
 
కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఆదాయపు పన్ను విధానంలో కొత్తగా మారేదీ ఏదీ లేదు. 
ప్రస్తుత పాత పన్ను విధానం స్థానంలో సెక్షన్ 115బిఏసీ (1ఏ) కింద కొత్త పన్ను విధానం ఆర్థిక చట్టం 2023లో ప్రవేశపెట్టారు. 
2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి కంపెనీలు, సంస్థలు కాకుండా వ్యక్తులందరికీ కొత్త పన్ను విధానం డీఫాల్టుగా వర్తిస్తుంది. 
కొత్త పన్ను విధానంలో పన్ను రేట్లు తక్కుగా ఉన్నాయి. అయితే, పాత పన్ను విధానంలో కల్పిస్తున్న మినహాయింపులు, డిడక్షన్స్ (స్టాండర్డ్ డిడక్షన్ రూ.50 వేలు, ఫ్యామిలీ పెన్షన్ రూ.15 వేలు మినహా) కొత్త విధానంలో లేవు. 
కొత్త పన్ను విదానం ఇక నుంచి డీఫాల్ట్‌గా వర్తించనుంది. అయితే, పన్ను కట్టేవారు కొత్తది లేదా పాతదాంట్లో ఏది లాభదాయకంగా ఉంటే దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. 
 
2024-25 ఆర్థిక యేడాదికి సంబంధించి రిటర్నులు ఫైల్ చేసే వరకు కొత్త పన్ను విధానం నుంచి వైదొలగడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి వ్యాపార ఆదాయం లేని అర్హులైన వ్యక్తులు ప్రతి ఆర్థిక సంవత్సరానికి తమకు నచ్చిన  పన్ను విధానాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. వారు ఒక ఆర్థిక యేడాదిలో కొత్త పన్ను విధానం మరొక యేడాదిలో పాత పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు. 
 
కొత్త పన్ను విధానం 115 బీఏసీ (1ఏ) ప్రకారం... 
రూ.3 లక్షల వరకు పన్ను లేదు. 
రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు 5 శాతం పన్ను
రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు 10 శాతం పన్ను
రూ.9 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు 15 శాతం పన్ను
రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 20 శాతం పన్ను
ఆదాయం రూ.15 లక్షలకు పైబడితే రూ.30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 
 
పాత పన్ను విధానం ప్రకారం 
రూ.2.5 లక్షల వరకు సున్నా శాతం పన్ను
రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు 5 శాతం పన్ను
రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రూ.20 శాతం పన్ను
రూ.10 లక్షలకు పైబడితే రూ.30 శాతం పన్ను. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎక్కడ చూసినా డబ్బే.. రూ.35.50 లక్షలతో కూడిన బ్యాగ్ స్వాధీనం