Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గుంటూరులో రూ. 2500 కోట్ల పెట్టుబడితో శ్రీ సిమెంట్ 3 మిలియన్ టన్నుల ఇంటిగ్రేటెడ్ సిమెంట్ ప్లాంట్‌

image

ఐవీఆర్

, మంగళవారం, 2 ఏప్రియల్ 2024 (22:54 IST)
భారతదేశంలోని అతిపెద్ద సిమెంట్ ఉత్పత్తిదారుల్లో ఒకటైన శ్రీ సిమెంట్, ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, దాచేపల్లి గ్రామంలో తమ కొత్త ఇంటిగ్రేటెడ్ ప్లాంట్‌ను షెడ్యూల్‌కు ఆరు నెలలకు ముందుగానే  ప్రారంభించింది. ఈ కొత్త ప్లాంట్ సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం 3 MTPA. ఈ కొత్త ప్లాంట్, శ్రీ సిమెంట్ యొక్క తయారీ సామర్థ్యాన్ని 56.4 MTPAకి పెంచటంతో పాటుగా, సిమెంట్ పరిశ్రమలో కీలక సంస్థగా దాని స్థానాన్ని మరింత పటిష్టం చేస్తుంది.
 
రూ. 2,500 కోట్ల పెట్టుబడితో నిర్మించబడిన గుంటూరు ప్లాంట్, దేశంలో శ్రీ సిమెంట్ యొక్క ఆరవ ఇంటిగ్రేటెడ్ ఉత్పత్తి కేంద్రంగా నిలిచింది. కర్ణాటకలోని కోడ్లా తర్వాత దక్షిణ భారత దేశంలో రెండవ ప్లాంట్‌గా గుర్తింపు పొందింది. తెలంగాణ- ఆంధ్రప్రదేశ్‌ల అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌ల అవసరాలను తీర్చడానికి వ్యూహాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్, ఈ ప్రాంతం యొక్క ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుంది. ఈ కొత్త యూనిట్ దాదాపు 700 ప్రత్యక్ష ఉద్యోగాలు, 1300 పరోక్ష ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంది.
 
ఈ సందర్భంగా శ్రీ సిమెంట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ నీరజ్ అఖౌరి మాట్లాడుతూ, "మేము బాధ్యతాయుతంగా ఎదగడానికి కట్టుబడి ఉన్నాము. గుంటూరు ప్లాంట్ తయారీ కార్యక్రమాల వల్ల వెలువడే ఉద్గారాల నియంత్రణ కోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుంది, సమర్థవంతంగా విద్యుత్‌ను ఉపయోగించడం ద్వారా అధిక నాణ్యత గల సిమెంట్‌ను అందిస్తుంది. ఈ ప్లాంట్ ఉపాధి అవకాశాలు, స్థానిక కమ్యూనిటీలతో భాగస్వామ్యం ద్వారా ఈ ప్రాంతంలో ఆర్థిక వృద్ధి, శ్రేయస్సుకు కూడా తోడ్పడనుంది. ప్రజలు, సరఫరాదారులు, కస్టమర్‌లు, కమ్యూనిటీలకు సేవ చేయడంపై మా దృష్టి ఉంటుంది, సమగ్ర విలువ సృష్టిని లక్ష్యంగా చేసుకున్నాము" అని అన్నారు.
 
కొత్తగా ప్రారంభించబడిన ప్లాంట్ పర్యావరణ సుస్థిరతకు గణనీయమైన ప్రాధాన్యతనిస్తుంది. ఈ అత్యాధునిక సదుపాయంను మునిసిపల్ వ్యర్థాలు, బయోమాస్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనం, ముడి పదార్థాలను 30% వరకూ ఉపయోగించుకునేలా రూపొందించబడింది. ఈ రంగంలో అత్యధిక AFR వినియోగాన్ని కలిగి ఉన్న ప్లాంట్‌గా భారతదేశంలోని పరిశ్రమకు ఇది ఒక ప్రమాణాన్ని నిర్దేశిస్తుంది. మైనింగ్ పిట్‌లో నేల మట్టానికి 40 అడుగుల దిగువన లైమ్‌స్టోన్ క్రషర్‌ని వినూత్నంగా ఉంచడం ఈ ప్లాంట్ యొక్క ప్రత్యేకత. ఈ డిజైన్ ఎంపిక, డీజిల్ వినియోగాన్ని సమర్థవంతంగా తగ్గిస్తుంది. పర్యావరణ అనుకూల కార్యకలాపాలకు ప్లాంట్ యొక్క నిబద్ధతను ప్రదర్శిస్తుంది.
 
అంతేకాకుండా, ఈ ప్లాంట్ జీరో-వేస్టేజ్ సదుపాయంగా పనిచేస్తుంది. పూర్తిగా వాటర్ పాజిటివ్‌గా ఉంటుంది. ఇది ప్లాంట్‌లో వినియోగించే దానికంటే ఎక్కువ నీటిని, ప్రధానంగా వర్షపు నీటిని మైనింగ్ పిట్‌లోకి తిరిగి పంపుతుంది. అదనంగా, వాటర్-కూల్డ్ రకాలకు బదులుగా ఎయిర్-కూల్డ్ స్క్రూ కంప్రెషర్‌లు, ఎయిర్ డ్రైయర్‌ల స్వీకరణ, ప్రక్రియ నీటి వినియోగాన్ని మరింత తగ్గిస్తుంది, బాధ్యతాయుతమైన వనరుల నిర్వహణకు కంపెనీ  యొక్క నిబద్ధతను నొక్కి చెబుతుంది.
 
నీరజ్ మాట్లాడుతూ, “బిల్డ్ స్మార్ట్’ యొక్క మా ప్రధాన సిద్ధాంతం ద్వారా నడపబడుతున్న, శ్రీ సిమెంట్, ఒక ఆధునిక, గ్రీన్ బిల్డింగ్ మెటీరియల్ కంపెనీగా మారడానికి సరైన దిశలో దృఢంగా ఉంది. మా పరిశ్రమ ప్రముఖ పనితీరు బెంచ్‌మార్క్‌లను నిర్వహించడానికి, మేము మా సామర్థ్య వినియోగాన్ని పెంచుతున్నాము, మా బ్రాండ్ ఈక్విటీని, ఖర్చు సామర్థ్యాన్ని పెంచుతున్నాము, మా R&D ప్రయత్నాలను మరింత వేగవంతం చేస్తున్నాము. ఈ వ్యూహాత్మక విధానం మేము పరిశ్రమలో శ్రేష్ఠత యొక్క కొత్త ప్రమాణాలను నెలకొల్పడం కొనసాగించడాన్ని నిర్ధారిస్తుంది" అని అన్నారు. 
 
 
 
ఇండియా  మరియు UAE అంతటా సిమెంట్ తయారీ సౌకర్యాలను శ్రీ సిమెంట్ కలిగి ఉంది. ఆర్థిక సంవత్సరం 2028లో మరో 13 ప్లాంట్లు ప్రారంభమయ్యే నాటికి దాని ఉత్పత్తి లక్ష్యమైన 80 MTPA సామర్థ్యాన్ని సాధించనుంది. ఈ  దిశగా కంపెనీ ప్రయాణంలో  ఐదు ప్లాంట్లు  ఆర్థిక సంవత్సరం 2025లో ప్రారంభించబడనున్నాయి, గుంటూరు యూనిట్‌ను ప్రారంభించడం ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.
 
పరిశ్రమలో ప్రముఖ గ్రీన్ క్రెడెన్షియల్స్, అత్యాధునిక వినూత్న పద్ధతులు, ఉత్తమ కార్యాచరణ సామర్థ్యం మరియు కాస్ట్ లీడర్షిప్ కు శ్రీ సిమెంట్ లిమిటెడ్ ప్రసిద్ధి చెందింది. సస్టైనబిలిటీ అనేది  దాని వృద్ధి వ్యూహానికి మూలస్తంభంగా వుంది , కంపెనీ తమ  వినియోగదారులకు అత్యంత పర్యావరణ అనుకూలమైన నిర్మాణ పరిష్కారాలను అందించడానికి ప్రయత్నిస్తోంది.
 
 
 
బ్రాండ్ పోర్ట్‌ఫోలియోలో అగ్రగామిగా ఉన్న బంగూర్ మాగ్నా దాని జీటా పొటెన్షియల్ షీల్డ్‌తో పూర్తి రక్షణను అందిస్తుంది. విభిన్న స్మార్ట్ బిల్డింగ్ అవసరాలను తీర్చడంలో భాగంగా , శ్రీ సిమెంట్ బంగూర్ జంగ్రోధక్‌ను అందిస్తుంది, ఇది తుప్పు పట్టకుండా కాపాడుతుంది; బంగూర్ పవర్‌మ్యాక్స్, ఉన్నతమైన శక్తి కోసం పవర్‌గ్రైండ్ టెక్నాలజీతో తయారు చేయబడింది; మరియు బంగూర్ రాక్‌స్ట్రాంగ్, ఇది  ఇన్స్టంట్ గా  రాతి వంటి శక్తిని అందిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఖగోళ అద్భుతం- 1504... 54 ఏళ్ల తర్వాత ఏర్పడే సంపూర్ణ సూర్య గ్రహణం..