Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక్కడ భయంగా ఉంది.. వేరే బ్యారక్‌కు మార్చండి.. వంశీ పిటిషన్

ఠాగూర్
మంగళవారం, 4 మార్చి 2025 (10:59 IST)
విజయవాడ గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ కార్యాలయ ఉద్యోగి సత్యవర్థన్‌ కిడ్నాప్ కేసులో అరెస్టు అయిన వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి జైలులో భయంపట్టుకుంది. దీంతో తనను మరో బ్యారక్‌లోకి మార్చాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
 
మరోవైపు, తన కిడ్నాప్ కేసులో సత్యవర్థన్ ఎస్సీఎస్టీ కోర్టు మేజిస్ట్రేట్‌కు వాంగ్మూలం ఇచ్చారు. దీన్ని విజయవాడ ఎస్పీకి కోర్టు అందజేసింది. తన కిడ్నాప్ ఎలా జరిగిందన్న దానిపై సత్యవర్థన్ పూసగుచ్చినట్టు చెప్పారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సత్యవర్థన్ స్టేట్మెంట్ కావాలని కోరుతూ పోలీసులు కోర్టును కోరారు. వారి విన్నపం మేరకు కోర్టు స్టేట్మెంట్‌ను అందజేసింది. 
 
మరోవైపు, ఈ కేసులో ఏ4గా వీర్రాజు, ఏ10గా ఉన్న వంశీ బాబు అనే నిందితులను విచారించేందుకు రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తనను వేరే బ్యారక్‍‌కు మార్చాలని కోరుతూ వంశీ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు మంగళవారం తీర్పును వెలువరించే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments