Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వల్లభనేని వంశీకి షాకిచ్చిన విజయవాడ కోర్టు!!

Advertiesment
Vallabhaneni Vamsi

ఠాగూర్

, సోమవారం, 24 ఫిబ్రవరి 2025 (16:09 IST)
గన్నవరంలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో అరెస్టయి జైలులో ఉన్న వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు తేరుకోలేని షాకిచ్చింది. వంశీని పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు మూడు రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ మూడు రోజులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని ఆదేశించింది. 
 
విజయవాడ పరిధిలోనే కస్టడీలోకి తీసుకుని విచారించాలంటూ న్యాయస్థానం స్పష్టం చేసింది. విచారణ సమయంలో న్యాయవాదిని కూడా అనుమతించాలని సూచించింది. అయితే, వెన్ను సమస్య ఉందని, ఈ కారణంగా ఇబ్బందిపడుతున్నట్టు వంశీ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఆయనకు జైలులో బెడ్ అనుమతిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. 
 
మరోవైపు, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సీఐడీ దర్యాప్తులో వేగం పెంచింది. ఇప్పటికే వంశీపై పీటీ వారెంట్ జారీ చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇందుకోసం ఈ నెల 25వ తేదీన కోర్టులో హాజరుపరచాలని న్యాయస్థానం ఆదేశించింది. అయితే, వంశీని కోర్టుకు నేరుగా తీసుకొస్తారా లేదా అన్నది జడ్జి నిర్ణయం మేరకు ఉంటుందని పోలీసులు చెప్పారు. వర్చువల్‌గా అని అంటే జైలు వద్దే వర్చువల్‌గా హాజరుపరిచి, అక్కడ నుంచే నేరుగా కస్టడీలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

MLC Election: మార్చి 20న ఎన్నికలు.. అదే రోజు లెక్కింపు