Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Chandrababu Naidu: హస్తినకు బయల్దేరనున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్.. ఎందుకో తెలుసా?

Advertiesment
Pawan Kalyan_Chandra Babu

సెల్వి

, బుధవారం, 19 ఫిబ్రవరి 2025 (11:44 IST)
Pawan Kalyan_Chandra Babu
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయన సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుండి దేశ రాజధానికి బయలుదేరుతారు. అలాగే గురువారం ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు హాజరవుతారు. ఈ ఢిల్లీ పర్యటన కారణంగా, చంద్రబాబు నేతృత్వంలో జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది.  
 
ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్ హాజరవుతున్నారు. అమరావతి నుంచి చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరి వెళతారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న పవన్ కల్యాణ్ ఈరోజు సాయంత్రం 6.30 గంటలకు బేగంపేట నుంచి ఢిల్లీకి వెళతారు. రాత్రి ఢిల్లీలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో బస చేస్తారు.
 
కాగా ఫిబ్రవరి 5న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగరవేసిన విషయం తెలిసిందే. దాదాపు 27 ఏళ్ల తర్వాత కమలం పార్టీ అధికారంలోకి వచ్చింది. మెుత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 48 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మిర్చి యార్డ్‌లోకి ప్రవేశిస్తే అరెస్టు చేస్తాం.. జగన్‌కు అనుమతులు నిరాకరణ