Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీ ఇల్లు ఎక్కడో చెబితే రోజూ వచ్చి కనబడి వెళ్తా: బిగ్ టీవీ రిపోర్టర్‌కి కొడాలి నాని షాక్ (Video)

Advertiesment
Kodali Nani

ఐవీఆర్

, మంగళవారం, 18 ఫిబ్రవరి 2025 (16:39 IST)
కొడాలి నాని పంచ్‌లు మామూలుగా వుండవు. తనదైన స్టైల్లో బిగ్ టీవీ రిపోర్టర్ కి సెటైరికల్ జవాబులు చెబుతూ కాసేపు అందరి దృష్టిని మరల్చారు కొడాలి నాని. కొడాలి నాని గారు ఇన్నిరోజులు ఏమైపోయారు? అంటూ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు... ఏమైపోవడం ఏంటమ్మా... మీ ఇల్లు ఎక్కడో చెబితే రోజూ వచ్చి కనబడి వెళ్తానంటూ సెటైర్ విసిరారు నాని. ఇంకా రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు కొడాలి నాని ఇచ్చిన సమాధానాలు ఏమిటో చూడండి.
 
రిపోర్టర్: కొడాలి నానిగారు ఇన్నిరోజులు ఏమైపోయారు?
నాని: ఏమైపోవడం ఏంటమ్మా... మీ ఇల్లు ఎక్కడో చెబితే రోజూ వచ్చి కనబడి వెళ్తా. కాదమ్మా... రాధాకృష్ణకు, నీకు, బీఆర్ నాయుడుకి ఇలా మీ పేర్లు చెబితే కనబడి వెళ్తా రోజూ....
 
రిపోర్టర్: అంతకుముందు బాగా యాక్టివ్‌గా వుండేవాళ్లు, కమ్యూనికేట్ చేసేవాళ్లూ...
నాని: గవర్నమెంటులో వున్నప్పుడు యాక్టివుగా వున్నా... ఇప్పుడేం జేయాలీ....
 
రిపోర్టర్: భయపడుతున్నారా ఇప్పుడు..
నాని: దేనికి.. 
 
రిపోర్టర్: గవర్నమెంట్లో లేనందుకు... మాట్లాడితే అరెస్టులు చేస్తారని భయపడుతున్నారా
నాని: నీకు ఉద్యోగం పీకేసినా కూడా యాక్టివుగా వుంటావా, మైకు పట్టుకుని తిరుగుతావా, మా ఉద్యోగం పీకేసారు కదా... ఇప్పుడేం చేయమంటావు యాక్టివుగా...
 
రిపోర్టర్: వల్లభనేని వంశీ అరెస్టును ఎలా చూస్తారు?
నాని: అరెస్టులాగే చూస్తా, ఏముంది ఇవన్నీ చిన్నచిన్న విషయాలు
 
రిపోర్టర్: నెక్ట్స్ మిమ్మల్నే అరెస్ట్ చేయబోతున్నారనీ, రెడ్ బుక్ లో మీ పేరే వుందని అంటున్నారు
నాని: రెడ్ బుక్ నేను చూడలా... నాకు చూపించలా, మీకు చూపించారా
 
రిపోర్టర్: పార్టీలో యాక్టివిస్టుగా వున్నారుగా
నాని: ఇప్పుడు లేనని మీరే చెప్పారు కదమ్మా
 
రిపోర్టర్: 3 కేసులు మీపై వున్నాయని చెబుతున్నారు...
నాని: 3 కాకపోతే 30 వేసుకోమనమ్మా లాయర్లు ఇంతమంది వుంది ఎందుకు?

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జనసేన ఆవిర్భావ మహానాడుపై పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన!!