Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జనసేన ఆవిర్భావ మహానాడుపై పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన!!

Advertiesment
jana sena party

ఠాగూర్

, మంగళవారం, 18 ఫిబ్రవరి 2025 (15:55 IST)
జనసేన పార్టీ ఆవిర్భావ మహానాడుపై ఆ పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. మార్చి 14వ తేదీన పార్టీ ఆవిర్భావ వేడుకలను తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ వేడుకలను జనసేన పార్టీ కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు జయప్రదం చేయాలని కోరారు. 
 
సార్వత్రిక ఎన్నికల్లో జనసేన 100 శాతం విజయంతో ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార మార్పిడికి, కూటమి ప్రభుత్వ ఏర్పాటులో జనసేన పార్టీ కీలక పాత్ర పోషించింది. ఇంతటి ఘన విజయం తర్వాత తొలి ఆవిర్భావ సభ కావడంతో సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రతిపాదన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. 

భార్యకు మెసేజ్‌లు పంపుతున్నాడని యువకుడి కుడిచేతిని నరికేసిన భర్త.. 
 
తన భార్యకు ఫోను ద్వారా పొద్దస్తమానం మెసేజ్‌లు పంపుతున్న ఓ యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కట్టుకున్న భర్త.. చివరకు ఆ యువకుడి కుడిచేతిని నరికేశాడు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకోవద్దని, ఫోను సందేశాలు పంపొద్దంటూ పలుమార్లు హెచ్చరించినా ఆ యువకుడు ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో విచక్షణ కోల్పోయిన భర్త.. ఆ యువకుడిపై కత్తితో దాడి చేసి చేతి వేలిని నరికేసాడు. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఏలూరు జిల్లా నిడమర్రు మండలం బావాయిపాలెంకు చెందిన మజ్జి ఏసురాజు (26) అనే యువకుడు ఇటీవల హత్యకు గురయ్యాడు. ఈ కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఏసురాజును ఆమె భర్త పలుమార్లు హెచ్చరించారు. కానీ, ఏసురాజు మాత్రం ఆ హెచ్చరికలను బేఖాతరు చేశాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఉండి మండలంలోని అత్తింట్లో తన భార్య ఏసురాజు ఉండటాన్ని గమనించిన భర్త.. తట్టుకోలేకపోయాడు. 
 
వెంటనే తన తండ్రి, మరో వ్యక్తికి ఫోన్ చేసి వారిని అక్కడికి రప్పించారు. అందరూ కలిసి ఏసురాజును పట్టుకుని బావాయిపాలెం తీసుకెళ్లారు. అక్కడ ఏసురాజుపై దాడి చేశారు. తన భార్యకు మెసేజ్‌లు పంపుతున్నాడంటా ఏసురాజు కుడిచేతిని సగానికిపైగా నరికి దూరంగా పడేశాడు. ఆ తర్వాత ఏసురాజును కాపవరం పంట కాలువ రేవులో పడేసి అక్కడ నుంచి ముగ్గురు పారిపోయారు. కుడి చేతిని నరికివేయడంతో తీవ్ర రక్తస్రావమనైన ఏసురాజును ఎవరూ గమనించకపోవడంతో అపస్మారకస్థితిలోకి జారుకుని ప్రాణాలు విడిచాడు. ఈ కేసులో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ పోలీసులందర్నీ బట్టలూడిదీసి నిలబెడతాం : పులివెందుల ఎమ్మెల్యే జగన్ వార్నింగ్ (Video)