Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా దగ్గర కూడా ఆడియోలు వున్నాయి, కానీ వాటిని ఇలా లీక్ చేయను: కిరణ్ రాయల్

Advertiesment
Kiran royal

ఐవీఆర్

, మంగళవారం, 18 ఫిబ్రవరి 2025 (12:41 IST)
వైసిపికి చెందిన కొంతమంది తనపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని జనసేన నాయకుడు కిరణ్ రాయల్ అన్నారు. తనపై సోషల్ మీడియాలో విడుదల చేస్తున్న ఆడియో క్లిప్పులన్నీ వాస్తవమైనవి కావనీ, అసలు ఆడియో క్లిప్పులను కోర్టుకి సబ్మిట్ చేసినట్లు తెలిపారు. కొంతమంది ఇదే పనిగా పెట్టుకున్నారనీ, అలాంటివారికి నేను చెప్పేది ఏమిటంటే... మీ దగ్గర ఇంకా ఏమైనా ఆడియో క్లిప్పింగులు వుంటే అవి కూడా త్వరగా పెట్టేస్తే అన్నీ కలిపి కోర్టుకి సమర్పిస్తానంటూ చెప్పారు. తను పారిపోయానంటూ కొంతమంది ప్రచారం చేస్తున్నారనీ, తను ఎక్కడకీ పారిపోననీ, అలాంటి రకాన్ని తను కాదంటూ వెల్లడించారు.
 
నాకు వారంటే బలహీనత...
తిరుపతి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ పైన లక్ష్మి అనే బాధితురాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తనవద్ద కిరణ్ రాయల్ బాగోతం మొత్తం వున్నదనీ, తన వద్ద వున్న పెన్ డ్రైవ్‌లో అతడికి చెందిన వాస్తవ రూపం వున్నదంటూ వాటిని ఒక్కొక్కటిగా లీక్ చేస్తోంది. తాజాగా బాధితురాలు లక్ష్మి విడుదల చేసిన ఓ ఆడియో క్లిప్ తీవ్ర దుమారాన్ని రేపుతోంది. అందులో వున్న వాయిస్ కిరణ్ రాయల్‌దంటూ ఆమె చెబుతోంది. ఆ ఆడియో రికార్డులో వున్న మాటలు వింటే అత్యంత జుగుప్సాకరంగా వున్నాయి.
 
" నాకు అమ్మాయిల బలహీనత. రోజుకో అమ్మాయితో నేను తిరుగుతాను. నా అలవాటును మార్చుకోలేను. నిన్ను బాగానే చూసుకుంటున్నాను కదా. ఇంకా నీకెందుకు బాధ. నాకు ఆ వీక్నెస్ వుంది కనుక దాన్ని నేను మానలేను. తిరుపతి జనసేన టిక్కెట్ రాదని చెప్పేసారు. కానీ కూటమి రాగానే నాకు ఏదో ఒకటి నామినేటెడ్ పదవి వస్తుంది. కనుక అప్పుడు నీ డబ్బు అంతా సెటిల్ చేస్తాను" అంటూ ఆ ఆడియో రికార్డులో వుంది. బాధితురాలు లక్ష్మి విడుదల చేసిన వాయిస్ రికార్డులో వున్నది కిరణ్ రాయల్ స్వరమేనా... కాదా అన్నది తేలాల్సి వుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డ్రగ్స్ ఇచ్చాను.. మత్తులోకి జారుకోగానే అత్యాచారం చేస్తూ వీడియోలు తీశాను...