Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎమ్మెల్సీ ఎన్నికలు : కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలుపు - కామెంట్స్

Advertiesment
alapati rajendraprasad

ఠాగూర్

, మంగళవారం, 4 మార్చి 2025 (10:41 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెల్లడవుతున్నాయి. ఇందులోభాగంగా ఉమ్మడి కృష్ణా - గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఘన విజయం సాధించారు. ఇంకా రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తికాకముందే ఆయన మ్యాజిక్ సంఖ్యను దాటేశారు. 
 
మంగళవారం తెల్లవారుజామున 5.50 గంటల సమయానికి ఆయనకు 82,320 ఓట్ల ఆధిక్యం లభించింది. మొత్తం 9 రౌండ్లు పూర్తయ్యే సరికి సమీప ప్రత్యర్థి, పీడీఎఫ్ బలపరిచిన సిట్టింగ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణ రావుపై 82,320 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఇక్కడ మొత్తం 2,41,873 ఓట్లు పోలయ్యాయి. ఈ గెలుపుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. 
 
మరోవైపు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గంలో గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. పోటాపోటీగా జరిగిన ఈ ఎన్నికల్లో ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మపై ఆయన గెలుపొందారు. ఇకపోతే, ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ ముగిసే సమయానికి కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం 28 వేల ఓట్లకుగాను ఆయన 16520 ఓట్లు సాధించారు. స్వతంత్ర అభ్యర్థి దిడ్ల వీరరాఘవులుకు 5818 ఓట్లు వచ్చాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్వేతసౌథంలో ట్రంప్‍తో మాటల యుద్ధం.. ఉక్రెయిన్‌కు ఆగిన సాయం!