Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ దెబ్బకు కన్నుమూసిన కాకినాడ వైకాపా అధ్యక్షుడు

Webdunia
ఆదివారం, 8 నవంబరు 2020 (16:17 IST)
కరోనా వైరస్ సోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో నేత కన్నుమూశారు. ఆయన పేరు ఫ్రూటీ కుమార్. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉంటున్నారు. ఈయన కరోనా వైరస్ బారినపడి చికిత్స పొందుతూ కన్నుమూశారు. 
 
ఈయనకు ఇటీవల కరోనా వైరస్ సోకడంతో విశాఖలోని ఓ ఆసుపత్రిలో చికిత్సను పొందుతున్నారు. పరిస్థితి విషమించి, పలు అవయవాలు దెబ్బతినడంతో, ఆయన కన్నుమూశారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
 
ఇటీవలే ఫ్రూటీ కుమార్ భార్య చంద్రకళా దీప్తికి ఫోన్ చేసిన వైఎస్ జగన్, ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఫ్రూటీ కుమార్ మరణంతో కాకినాడ వైసీపీ నేతల్లో విషాదం నెలకొంది. 
 
ఆయన పార్టీకి ఎంతో సేవ చేశారని పలువురు నేతలు కొనియాడారు. ఫ్రూటీ కుమార్ మృతిపట్ల మంత్రులు, జిల్లా నేతలు సంతాపం తెలిపారు. ఆయన అంత్యక్రియలు నేడు జరగనున్నాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
 
మరోవైపు, దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. దేశంలో కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో 45,674 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 85,07,754 కి చేరింది. ఇక గత 24 గంటల్లో 49,082 మంది కోలుకున్నారు.
 
అలాగే గడచిన 24 గంట‌ల సమయంలో 559 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,26,121 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 78,68,968 మంది కోలుకున్నారు. 5,12,665 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
 
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 11,77,36,791 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 11,94,487 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
 
తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,440 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఐదుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,481 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,50,331 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,29,064 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1377 కి చేరింది. 
 
ప్రస్తుతం 19,890 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 17,135 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 278 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 112 కేసులు నిర్ధారణ అయ్యాయి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments