Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారతీయ అమెరికన్ల సాయం- జో బైడెన్‌కే అగ్రరాజ్య అధ్యక్ష పీఠం

భారతీయ అమెరికన్ల సాయం- జో బైడెన్‌కే అగ్రరాజ్య అధ్యక్ష పీఠం
, శనివారం, 7 నవంబరు 2020 (22:58 IST)
Joe Biden_KamalaHarris
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అగ్రరాజ్య నూతన అధ్యక్షుడిగా డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ గెలుపును నమోదు చేసుకున్నారు. మొత్తం 538 ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లకు గాను ఆయన 284 ఓట్లు సాధించినట్లు అమెరికా మీడియా వెల్లడించింది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌కు 214 ఎలక్టోరల్‌ ఓట్లు మాత్రమే దక్కాయి. 
 
పెన్విల్వేనియా రాష్ట్రంలో విజయం సొంతం కావడంతో అధ్యక్ష పీఠం బైడెన్ సొంతమైంది. ఎన్నికలు ముగిసినప్పటికీ గత కొద్ది రోజులుగా ఐదు రాష్ట్రాల్లో ఉత్కంఠగా ఓట్ల లెక్కింపు సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ గెలుపు ద్వారా అమెరికా అధ్యక్షుడిగా బైడెన్‌, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్‌ జర్నీ కొనసాగనుంది. 
 
కాగా... అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ విజయం సాధించడంలో భారతీయ అమెరికన్లు కీలక పాత్ర పోషించారు. పెన్సిల్వేనియాలో విజయంతో బైడెన్‌కు ఇప్పటివరకు 284 ఎలక్టోరల్ ఓట్లు రాగా.. ట్రంప్‌ 214 దగ్గరే ఆగిపోయాడు. అధ్యక్ష ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కాకముందు నుంచి బైడెన్‌ అమెరికా-ఇండియన్‌లపై ప్రత్యేక దృష్టిసారించారు. 
 
ఉపాధ్యక్ష అభ్యర్థి కమలాదేవి హారిస్‌తో జతకట్టడం కూడా ఆయనకు మరింత కలిసొచ్చింది. ప్రధాన నిధుల సేకరణలో కూడా భారతీయ అమెరికన్లు బైడెన్‌కు అండగా నిలిచి పెద్ద మొత్తంలో విరాళాలను అందజేశారు. భారతీయ అమెరికన్లతో పాటు ఈ ఏడాది తన ప్రచారం కోసం కనీసం 100,000 డాలర్లు సేకరించారు.
 
జో బైడెన్‌కు ఆర్థికంగా అండగా నిలిచిన వారిలో భారతీయులు ప్రధాన పాత్ర పోషించారు. 800 మంది ప్రధాన దాతల జాబితాలో డజన్ల మంది భారతీయ అమెరికన్లు ఉన్నారు. భారతీయ అమెరికన్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నవారు ప్రసిద్ధ సంఘ నాయకులు స్వదేశ్ ఛటర్జీ, రమేష్ కపూర్, శేఖర్ ఎన్ నరసింహన్, ఆర్ రంగస్వామి, అజయ్ జైన్ భూటోరియా, ఫ్రాంక్ ఇస్లాం ఉన్నారు. 
 
అలాగే, ఇతర ప్రముఖ భారతీయ అమెరికన్ దాతల్లో నీల్ మఖిజా, రాహు, ప్రకాష్, దీపక్ రాజ్, రాజ్ షా, రాజన్ షా, రాధిక షా, జిల్, రాజ్ సింగ్, నిధి ఠాకర్, కిరణ్ జైన్, సోనీ కల్సి, బేలా బజారియా ఉన్నారు. భారతీయ-అమెరికన్ కాంగ్రెస్ మహిళ అభ్యర్థి ప్రమీలా జయపాల్ కూడా బైడెన్‌కు ఆర్థిక సాయం చేశారు. విరాళాలు అందజేసినవారి జాబితాలో 100,000 డాలర్లకు పైగా ఇచ్చిన వారు కూడా ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్రంప్‌కు చుక్కెదురు.. #JoeBiden, #KamalaHarrisల విజయం..