Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సస్పెన్స్‌కు తెర... అమెరికా 46వ శ్వేతసౌథం అధినేతగా బైడెన్

Advertiesment
సస్పెన్స్‌కు తెర... అమెరికా 46వ శ్వేతసౌథం అధినేతగా బైడెన్
, ఆదివారం, 8 నవంబరు 2020 (08:45 IST)
గత బుధవారం నుంచి కొనసాగుతూ వచ్చిన సస్పెన్స్‌కు తెరపడింది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడుగా జో బైడెన్ విజయకేతనం ఎగురవేశారు. తద్వారా అమెరికా 46వ అధ్యక్షుడిగా ఆయన పగ్గాలు చేపట్టనున్నారు. ఆయన డిప్యూటీగా భారతీయ మూలాలున్న కమలా హారీస్ బాధ్యతలు స్వీకరించనున్నారు. 
 
ఈ నెల 3వ తేదీన అమెరికా అధ్యక్ష పీఠానికి ఎన్నికలు జరిగాయి. ఈ పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అలా మొదలైన ఈ ఓట్ల లెక్కింపు నాలుగు రోజులుగా కొనసాగుతూ తీవ్ర ఉత్కంఠను రేపింది. చివరకు శనివారం రాత్రికి ఓ క్లారిటీ వచ్చింది. ఫలితంగా యూఎస్ 46వ అధ్యక్షుడిగా జోసఫ్ రాబినెట్టి బైడెన్ జూనియర్ విజయం సాధించారు. 
 
దాదాపు నాలుగు రోజులకు పైగా ఓటింగ్ కొనసాగిన పెన్సిల్వేనియాలో బైడెన్ విజయం సాధించారని, దీంతో మెజారిటీకి కావాల్సిన 270 ఎలక్టోరల్ ఓట్లకు మించి ఆయనకు వచ్చాయని సీఎన్ఎన్, ఎన్బీసీ, అసోసియేటెడ్ ప్రెస్ వంటి వార్తా సంస్థలు వెల్లడించాయి. 
 
ఇక బైడెన్‌తో పాటు ఈ ఎన్నికల్లో పోటీపడిన 56 ఏళ్ల కాలిఫోర్నియా సెనేటర్ కమలా హారిస్, ఉపాధ్యక్షురాలిగా ఎన్నికకానున్న తొలి నల్లజాతి ఇండో అమెరికన్ మహిళగా నిలువనున్నారు.
 
ప్రస్తుతం 77 ఏళ్ల వయసులో ఉన్న ఆయన, 1992లో బిల్ క్లింటన్ తర్వాత అధ్యక్షుడిని ఓడించిన రికార్డునూ సొంతం చేసుకున్నారు.1992లో హెచ్ డబ్ల్యూ బుష్‌ను బిల్ క్లింటన్ ఓడించారన్న సంగతి తెలిసిందే.
 
ప్రస్తుతం బైడెన్ 284 ఓట్లను గెలుచుకున్నారని పలు వార్తా సంస్థలు తెలియజేస్తున్నాయి. ఆరిజోనాలోనూ బైడెన్ గెలిచారని తెలుస్తున్నా, పలు నెట్‌వర్క్‌లు దాన్నింకా ఖరారు చేయలేదు. 
 
ఆరిజోనాను పక్కనబెట్టినా, విజయానికి అవసరమైన 270 ఓట్లతో పోలిస్తే 273 ఎలక్టోరల్ ఓట్లు బైడెన్ ఖాతాలో ఉన్నట్టు. అయితే, ఇప్పటికీ, తన ఓటమిని అంగీకరించేందుకు ట్రంప్ సిద్ధంగా లేకపోవడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతీయ అమెరికన్ల సాయం- జో బైడెన్‌కే అగ్రరాజ్య అధ్యక్ష పీఠం