Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేతులు కలిపిన "కమలసేన" - అధికారంలోకి వస్తామన్న పవన్ కళ్యాణ్

Webdunia
గురువారం, 16 జనవరి 2020 (16:08 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ - జనసేన పార్టీలు చేతులు కలిపాయి. వచ్చే నాలుగున్నరేళ్లు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. అన్ని రకాల ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నాయి. ఈ మేరకు గురువారం విజయవాడలో సమావేశమైన బీజేపీ - జనసేన పార్టీ నేతల సమావేశంలో నిర్ణయించారు. 
 
ఈ సమావేశం అనంతరం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు, ప్రయోజనాల కోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నామనీ, రెండు పార్టీల మధ్య ఉన్న చిన్నచిన్న సమస్యలను పరిష్కరించుకుంటామనీ, రెండు పార్టీల్లో అవగాహనాలోపం రాకుండా అన్నీ చర్చించామనీ, బీజేపీ పెద్దలతో కొన్నాళ్లుగా చర్చలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.
 
ఇంకా పవన్ చెపుతూ... 'బీజేపీతో ఏర్పడిన అంతరాలను తొలగించుకున్నాం. బీజేపీ-జనసేన మధ్య సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తాం. వచ్చే ఎన్నికల్లో బీజేపీ-జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. బీజేపీ, జనసేన రూపంలో రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయం వస్తుంది. మోడీ, అమిత్‌ షా నమ్మకాన్ని నిలబెడతాం. రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో కలిసి నడుస్తామ'ని పవన్‌ కళ్యాణ్‌ తేల్చి చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

టికెట్ రేట్స్ పై ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం మంచిదే: తెలంగాణ చైర్మ‌న్‌ విజేంద‌ర్ రెడ్డి

బుర్ర కథా కళాకారిణి గరివిడి లక్ష్మి కథతో చిత్రం రూపొందబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments