Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇసుక సరఫరాకు జేసీలు ప్రత్యేక దృష్టి సారించాలి: జగన్​

Webdunia
గురువారం, 24 అక్టోబరు 2019 (05:52 IST)
రాష్ట్రంలో ఇసుక కొరత, సరఫరా ఇబ్బందులపై సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. అనుసరించాల్సిన విధానాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

రాష్ట్రంలో ఇసుక కొరత, సరఫరా ఇబ్బందులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి, గనుల శాఖ అధికారులు హాజరయ్యారు. ప్రస్తుతం కృష్ణా, గోదావరి నదుల్లో కొనసాగుతున్న వరద పరిస్థితుల కారణంగా తవ్వకాలకు ఇబ్బందులు ఉన్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

97 రీచ్​ల ద్వారా పరిమితంగా జరుపుతున్న తవ్వకాలతో రోజుకు 45 వేల మెట్రిక్ టన్నుల ఇసుకను సరఫరా చేయగలుగుతున్నట్టు వివరించారు. తక్షణం ఇసుక కొరతను తీర్చేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.

రిజర్వాయర్లలో డీసిల్టేషన్ ద్వారా ఇసుకను తవ్వి... సరఫరా చేయాలని సూచించారు. ప్రైవేటు పట్టా భూముల్లోనూ తవ్వకాలను పెంచాల్సిందిగా సూచించారు.

ఇసుక సరఫరా కోసం అనుసరిస్తున్న విధానంలోనూ స్వల్ప మార్పులు చేయటంతో పాటు.. జాయింట్ కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. సామాన్యులకు ఇసుక లభ్యమయ్యేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments