విజయవాడ నుంచి ఒకేరోజు నాలుగు విమాన సర్వీసులు కొత్తగా ప్రారంభమవుతున్నాయి. ఊ నెల 27 నుంచి ఈ సర్వీసులు నడిపేందుకు పౌరవిమానశాఖ నిర్ణయించింది. తిరుపతికి , విశాఖతో పాటు హైదరాబాద్‌కు రెండు కొత్త విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయ డైరెక్టర్ జి.మధుసూదనరావు తెలిపారు.
ఈ నెల 27 న విజయవాడ నుంచి 4 విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయ డైరెక్టర్ జి.మధుసూదనరావు తెలిపారు. తిరుపతి, విశాఖలతో పాటు హైదరాబాద్‌కు రెండు విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.
తిరుపతి-విజయవాడ మధ్య రానున్న ఎయిర్ బస్ వారానికి మూడు రోజులు అందుబాటులో ఉంటుందన్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు స్పైస్ జెట్, ఇండిగో విమాన సర్వీసులు ప్రారంభమవుతాయన్నారు. విజయవాడ-విశాఖ విమాన సర్వీసు తిరిగి పునరుద్ధరిస్తామన్నారు. విజయవాడ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సహా సివిల్ ఏవియేషన్‌కు లేఖలు రాశామని... అంతర్జాతీయ విమానాలు నడిచేందుకు మరింత సమయం పడుతుందని అన్నారు. జూలై 2020 నుంచి హజ్ విమానాలు విజయవాడ నుంచే నేరుగా బయలుదేరతాయన్నారు.