Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.10 కోట్లు వెచ్చించి రాష్ట్రంలో అల్లర్లకు ఓ పార్టీ కుట్ర : నాగబాబు కామెంట్స్

వరుణ్
బుధవారం, 24 జులై 2024 (17:00 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు ఓ పార్టీ కుట్ర పన్నుతుందని, ఇందుకోసం రూ.10 కోట్ల మేరకు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉందని జనసేన పార్టీ నేత నాగబాబు సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో పాలన సజావుగా సాగకుండా అడ్డుకునేందుకు ఓ పార్టీ ప్రయత్నిస్తోందని నాగబాబు తెలిపారు. గొడవలు రేకత్తించేందుకు చేసే ఖర్చేదో పేదల సంక్షేమానికి ఉపయోగించాలని సూచన ఆయన సూచించారు. అలా చేస్తే వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా అయినా దక్కుతుందని ఆయన చెప్పారు. 
 
ఏపీలోని టీడీపీ కూటమి పాలన సజావుగా సాగకుండా అడ్డుకునేందుకు ఓ పార్టీ ప్రయత్నిస్తుందని, అది ఏ పార్టీలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ఆరోపించారు. రాష్ట్రంలో గొడవలు, అల్లర్లు, హింసాత్మక ఘటనల కోసం జిల్లాకు రూ.10 కోట్ల చొప్పున రాబోయే రెండేళ్ల కాలానికి ఖర్చు పెట్టేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తున్నట్టు తమకు సమాచారంఅందిందని పేర్కొన్నారు.
 
జిల్లాకు రూ.10 కోట్ల చొప్పున మొత్తం రూ.130 కోట్లు, యేడాది రూ.1500 కోట్ల అల్లర్లు ఖర్చు చేసే బదులు ఆ డబ్బును సామాన్యుల సంక్షేమానికి ఉపయోగించి చేసిన పాపాలు కడుక్కోవడానికి ఖర్చు చేసి ఉంటే కొంతలో కొంతైనా సానుభూతి వచ్చేదని, కానీ ఇలా అల్లర్లు ద్వారా మధ్యంతర పాలన వస్తుందన్న పనికిమాలిన ఆలోచనలు మానుకుంటే మంచిదని హితవు పలికారు. ఇలాంటి క్రూరమైన ఆలోచనలు తమదాకా రావని అడ్డుకోవద్దన్నారు.
 
ఇలాంటి వాటిని ధీటుగా ఎదుర్కొంటామని తేల్చి చెప్పారు. హింసాత్మకం చర్యలకు ఆ డబ్బును ఖర్చుచేసే బదులు దానిని పేదల కోసం ఖర్చు చేస్తే, వారి పురోగతి కోసం ఖర్చు పెడితే ఈసారి ప్రతిపక్ష హోదా అయినా దక్కుతుందని సలహా ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముత్తయ్య నుంచి అరవైల పడుసోడు.. సాంగ్ రిలీజ్ చేసిన సమంత

Odela2 review: తమన్నా నాగసాధుగా చేసిన ఓదేల 2 చిత్రం ఎలావుందో తెలుసా

మూట ముల్లెతో లావణ్య ఇంటికి చేరుకున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు!!

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments