Webdunia - Bharat's app for daily news and videos

Install App

మున్సిపల్ కమిషనర్‌గా సీఎం జగన్?

Webdunia
బుధవారం, 2 అక్టోబరు 2019 (16:08 IST)
ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను మున్సిపల్ కమిషనర్‌గా మార్చేశారు. పార్వతీపురం పురపాలక శాఖ తప్పిదం జనాలకు నవ్వులాటగా మారింది.

వార్డు సచివాలయం ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో పార్వతీపురం మున్సిపల్ కమిషనర్‌ స్థానంలో ముఖ్యమంత్రి జగన్ ఫొటో పెట్టారు. అంతే కాకుండా ప్రత్యేక అధికారిగా ఎమ్మెల్యే జోగారావు ఫోటోను పెట్టారు. ఈ ఫ్లెక్సీని వార్డు సచివాలయం ముందు ఏర్పాటు చేశారు.

దీంతో ఫ్లెక్సీని చూసిన జనాలు నవ్వుకుంటున్నారు. అనంతరం తప్పిదం తెలసుకున్న మున్సిపల్ అధికారులు.. వెంటనే ఫ్లెక్సీని తొలగించారు.

ఇదిలా వుండగా తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం పెద రాయవరం గ్రామ సచివాలయంపై ఉన్న సీఎం జగన్మోహన్‌రెడ్డి బొమ్మపై రంగుపూసిన పెదరాయవరం గ్రామానికి చెందిన కొట్టు సూరిబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని స్టేషన్‌కు తరలించామని ఎస్‌ఐ తెలిపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments