Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గాంధీజీ ఆశయం.. జగన్ ఆచరణం: మంత్రి బొత్స

గాంధీజీ ఆశయం.. జగన్ ఆచరణం: మంత్రి బొత్స
, బుధవారం, 2 అక్టోబరు 2019 (15:02 IST)
చీపురుపల్లిలో గ్రామ సచివాలయంను రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. బుధవారం చీపురుపల్లి లో జరిగిన కార్యక్రమంలో గాంధీజీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని వారి చిత్ర పటాలకు పూలమాలలు వేసి మంత్రి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రంలో మంత్రి బొత్స మాట్లాడుతూ.. పూజ్య బాపూజీ స్పూర్తితో..ఆయన కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని దేశంలో ఎవరూ ఆచరణలో పెట్టకపోయినా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆచరణ చేసి చూపించారన్నారు. ఇంటి ముంగిటకి నవ రత్నాలు తీసుకు వెళ్లేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ సచివాలయం వ్యవస్థను తీసుకు వచ్చారన్నారు. 

 
ఇది వరకు ఉద్యోగాలు లభించాలంటే అదొక కలగా ఉండేది..కానీ నేడు వాటికి భిన్నంగా దేశంలో ఎక్కడా లేని విధంగా లక్ష 30వేలు ఉద్యోగాలు ఇవ్వడం శుభ పరిణామని మంత్రి అభివర్ణించారు. యువత తమ కాళ్ళ తాము నిలబడేలా నాలుగు నెలల్లో నాలుగు లక్షల ఉద్యోగులు ఇచ్చిన ఘనత వైఎస్సార్ ప్రభుత్వానికే దక్కుతోందన్నారు. 

ప్రజా ప్రతినిధులు తలెత్తుకొని తిరిగేలా మా ప్రభుత్వం ఉద్యోగాలకు పెద్ద పీట వేసిందన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా అవినీతి రహిత పాలన అందించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారని చెప్పారు. ప్రభుత్వ ఆశయాలకి అనుగుణంగా విధులు నిర్వర్తించాలని దిశా నిర్దేశం చేశారు. 

 
రాష్ట్రంలో కొన్ని దుష్ట శక్తులు ఈ వ్యవస్థను నిర్వీర్యం చేయాలని కుట్ర చేస్తున్నాయి. ఆ కుట్రలో సచివాలయ ఉద్యోగులు బలి కాని విధంగా అంకితభావంతో విధులు నిర్వర్తించాలని కోరారు. అన్ని విభాగాల్లో నిష్ణాతులైన వారు ఈ ఉద్యోగాలను పొందారని తెలిపారు. ఎంపికైన ఉద్యోగులు..తమ గ్రామాన్ని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దే బాధ్యత వారి పై ఉందన్నారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఎక్కడా ఇంత పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు జరిగిన దాఖలాలు లేవన్నారు. ముఖ్యమంత్రి ఆశయాలు, దృక్పధంతో ముందుకు సాగుతూ గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని గ్రామాల్లో కి తీసుకు వెళ్లే బాధ్యత మీపై ఉందన్నారు.

 
రాష్ట్రంలో 5 కోట్ల మందికి మేలు జరిగేలా ప్రభుత్వం కి మంచి పేరు తీసుకు రావాలి. జిల్లా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్ళాలి. సిఎం పట్టుదలనే ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని మంత్రి కోరారు.  ఎంపీ బెల్లాన చంద్ర శేఖర్ మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినపుడు..యువతకు ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీను నాలుగు నెలల్లో చేసి చూపించారన్నారు. 
 
పరీక్షలు బాగా నిర్వహించి..40 రోజుల్లోనే పోస్ట్లు ఇచ్చారన్నారు. ఒక్కో పంచాయితీకి 24 వరకు పోస్ట్లు మంజూరు అయ్యాయని తెలిపారు. ప్రతి సమస్యకి, సంక్షేమానికి, అభివృద్ధి కి ఒక్కో ఉద్యోగిని నియమించడం శుభపరిణామన్నారు.

ప్రభుత్వానికి దశ, దిశ సచివాలయం ఉద్యోగులే. అంకిత భావంతో పని చేయాలని కోరారు. అన్ని కులాలకు చెందిన వారు ఉద్యోగులుగా ఎంపికయ్యారు..కనుచూపు మేరలో కనబడని ప్రభుత్వ ఉద్యోగం తమ బిడ్డలకు దక్కడంపై తల్లిదండ్రులు సంతోసిస్తున్నారన్నారు. చీపురుపల్లి లో ఈనాం భూములకు సంబంధించి రైతు భరోసాకు అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. 
 
జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్..మాట్లాడుతూ..గాంధీ జయంతి ను పురస్కరించుకుని జిల్లాలో ప్లాస్టిక్ నిషేధం గా స్లోగన్ ఇవ్వడం జరిగిందన్నారు. గాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం..స్థానిక పాలనతో సాధ్యం అని భావించి సీఎం ఈ సచివాలయం వ్యవస్థను తీసుకు వచ్చారన్నారు. జిల్లాలో పని చేసిన ఏ కలెక్టర్ కి దక్కని గౌరవమైన అవకాశం నాకు దక్కిందన్నారు.

ఒకేసారి 4 వేల మంది ఉద్యోగుల అపాయింట్మెంట్ లపై చేయనొప్పి పుట్టిన యువత కోసం ఎంతో సంతోషంగా  సంతకాలు చేసానని తెలిపారు. తనసర్వీస్ లో ఇదొక అరుదైన అవకాశంగా భావిస్తున్నానన్నారు. 
 
ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ పెదబాబు, ఆర్ డీవో  సాల్మన్ రాజు, వైసీపీ నాయకులు చిన్న శ్రీను, కేవీ సూర్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోలీసు అధికారి అర్ధనగ్న ప్రదర్శన