Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రంలో ప్ర‌భుత్వం ఉందా లేదా? .. క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌

Webdunia
శనివారం, 28 సెప్టెంబరు 2019 (14:34 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వ‌భూషణ్ హరిచందన్‌ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో శ‌నివారం ఉద‌యం ప‌లువురు బీజేపీ నేతలు క‌లిశారు. ఈ సంద‌ర్భంగా మూడు అంశాలపై గవర్నర్‌కి వారు వినతి పత్రం అందజేశారు.

అనంత‌రం కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాలన గాలికొదిలేశార‌ని, అస‌లు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అని ప్రజల్లో అభిప్రాయం వ్యక్తం అవుతుంద‌న్నారు. గ్రామ సచివాలయం, వార్డ్ వాలంటీర్ల పరీక్షలు కూడా అపహాస్యం చేశార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయలేద‌ని, ఇస్తానుసారంగా నియామకాలు చేశార‌న్నారు.

ఇసుక అందుబాటులో లేక‌పోవ‌డం, భవన నిర్మాణ పనులు నిలిచిపోవడం వలన కార్మికులు రోడ్డున పడ్డార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సెప్టెంబర్ 5 దాకా ముహూర్తం పెట్టార‌ని అది దాటినా కూడా ఇసుక అందుబాటులో లేక‌పోవ‌డంతో ప్రజల కడుపులు మాడుతున్నాయని లేఖ రాసిన పట్టించుకోలేద‌న్నారు. ఇసుక ప్రజలకు అందుబాటులో లేదు అన్నారు.

సీఎం చేతలు, మాటలకు పొంతన లేద‌న్నారు. ఇసుక బ్లాక్‌లో దొరుకుతుంది తప్ప ప్రజలకు అందడం లెద‌న్నారు. దేవాలయ భూములు విషయంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల‌ని క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ డిమాండ్ చేశారు.

2017లో అసిస్టెంట్  ప్రొఫెసర్లు పోస్టులు నిలిచిపోయాయని వారికి పోస్ట్‌లు ఇవ్వాలని గవర్నర్‌కి తెలియజేసిన‌ట్లు చెప్పారు. స‌మస్యల పరిష్కారం కోసం అవసరమైతే విజయవాడలో ధర్నా చేస్తాం అని ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను గాలికొదిలేశార‌ని విమ‌ర్శించారు.

ప్రభుత్వంలో జరుగుతున్న అప్రజాస్వామిక విధానాలపై గ‌వ‌ర్న‌ర్‌కి వినతిపత్రం అందించామ‌న్నారు. ప్రభుత్వం ఇస్తామన్న మెరిట్ ఆధారిత ఉద్యోగాలిస్తామని అపహాస్య పరిస్ధితి తెచ్చింద‌ని పేర్కొన్నారు. రిజర్వేషన్లలో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ల రిజర్వేషన్ అమలు జరగలేదు అన్నారు.

భవన నిర్మాణ కార్మికులు, అనుబంధ కార్మికులు ఉపాధి కోల్పోయార‌ని తెలిపారు. లక్షల మంది ఆకలి చావుల పాలవుతున్నార‌ని, ఇంకా ఇసుక అందుబాటులోకి రాలేద‌న్నారు. దేవాలయ భూములను సొంత భూముల్లా తీసుకున్న నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామ‌న్నారు. ప్రభుత్వం ఆయా అంశాలపై వెంట‌నే స్పందించ‌క‌పోతే  ధర్నాకు దిగుతాం అని హెచ్చ‌రించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments