తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయుల నియామకాల అమలులో సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించలేదని దాఖలైన పిటిషన్‌ను ఉన్నత ధర్మాసనం కొట్టివేసింది. ఉపాధ్యాయ నియామకాల్లో జాప్యం జరుగుతుందని వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించలేదని దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్లపై తెలంగాణ వివరణ ఇచ్చింది. హైకోర్టులో కేసు ఉండటంతోనే కాస్త ఆలస్యమైందని అఫిడవిట్లో తెలంగాణ సీఎస్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ వివరణతో సంతృప్తి చెందిన జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం కోర్టు ధిక్కరణ కేసును కొట్టేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఉన్న కోర్టు ధిక్కరణ కేసును సుప్రీంకోర్టు ఆగస్టు 19నే కొట్టేసింది. ఇరు రాష్ట్రాల సీఎస్ల అఫిడవిట్లతో సంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు పాఠశాలల్లో మౌలిక వసతులపై ఉన్నత ధర్మాసనం ఉత్తర్వులు అమలు చేయాలని ఆదేశించింది.
నియామకాల్లో సుప్రీం ఆదేశాలు అమలు చేయలేదని పిటిషన్ వేసిన జేకే రాజు, వెంకటేష్‌లకు అభ్యంతరం ఉంటే హైకోర్టును ఆశ్రయించవచ్చునని సూచించింది.