Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంట పొలాల్లో ప్రియుడితో భార్య అర్థనగ్నంగా... ఫోటోలు తీసిన భర్త... ఎందుకో తెలుసా?

నెల్లూరు జిల్లాలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగస్తుల బండారం బయటపడింది. మహిళ భర్త రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకోవడంతో రచ్చరచ్చ అయ్యింది. ఒక్కసారిగా షాకైన ఇల్లాలు ప్రియుడితో కలిసి భర్త పైనే దాడికి దిగింది. భర్త ఫిర్యాదుతో ప్రేయసి, ప్రియులు జైలు పాలయ్యారు.

Webdunia
మంగళవారం, 1 మే 2018 (17:51 IST)
నెల్లూరు జిల్లాలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగస్తుల బండారం బయటపడింది. మహిళ భర్త రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకోవడంతో రచ్చరచ్చ అయ్యింది. ఒక్కసారిగా షాకైన ఇల్లాలు ప్రియుడితో కలిసి భర్త పైనే దాడికి దిగింది. భర్త ఫిర్యాదుతో ప్రేయసి, ప్రియులు జైలు పాలయ్యారు.
 
నెల్లూరు జిల్లా సంగం మండలం ఉడహౌస్ పేట గ్రామానికి చెందిన తిరుపతిరావు బుచ్చిరెడ్డిపాళ్యెంకు చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. పెళ్ళయిన యేడాదికే రెవిన్యూ శాఖలో ఆ యువతికి ఉద్యోగం వచ్చింది. వీరికి ఒక పాప పుట్టింది. ఏడేళ్ళ పాటు దాంపత్య జీవితం సజావుగానే సాగింది. ఆరు నెలల క్రితం సంఘం తహశీల్దార్ కార్యాలయానికి జూనియర్ అసిస్టెంట్‌గా బదిలీపై వెళ్ళింది. అదే కార్యాలయంలో పనిచేస్తున్న విఆర్‌ఓ రామక్రిష్ణారెడ్డి ఆమెను లోబరుచుకున్నాడు. దాంతో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.
 
కొన్నిరోజులుగా భార్య ప్రవర్తనలో తేడా రావడంతో భర్త అనుమానించాడు. తరచూ వాట్సాప్‌లలో చాటింగ్ చేస్తుండటంతో నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. మొగుడ్ని వదిలించుకోవాలనుకున్న ఇల్లాలు తన ప్రియుడు రామక్రిష్ణారెడ్డితో కలిసి భర్తపై గృహ హింస కేసు పెట్టింది. అప్పటి నుంచి దంపతులు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇదే అదునుగా భావించిన రామక్రిష్ణారెడ్డి ప్రియురాలితో కలిసి ఏకంగా కాపురమే పెట్టేశాడు. ఒకేచోట ఉద్యోగం కావడంతో అడ్డూఅదుపూ లేకుండా ఆ బంధాన్ని కొనసాగించారు. 
 
వీరిద్దరు కారులో వెళుతుండగా గుర్తించిన మహిళ భర్త వెంబడించాడు. పంటపొలాల్లో కారు ఆపి రాసలీలల్లో ఉండగా భర్త రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకున్నాడు. తన సెల్‌ ఫోనులో ఫోటోలు కూడా తీశాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రియురాలు, మహిళను ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments