Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలిపై ప్రియుడు లైంగికదాడి... సహకరించిన తల్లి

Webdunia
బుధవారం, 5 జూన్ 2019 (11:49 IST)
హైదరాబాద్ నగరంలో ఓ దారుణం జరిగింది. ఓ యువతిపై తన కుమారుడితో తల్లి అత్యాచారం చేయించింది. ఈ లైంగిక దాడికి పాల్పడింది కూడా ఆ యువతి ప్రియుడే. యువతిని అత్యాచారం చేస్తుంటే అతని తల్లి ఇంట్లో ఉండికూడా నోరుమెదపకుండా ఉండిపోయింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్, మల్లాపూర్‌కు సమీపంలోని కాప్రాకు చెందిన 18 యేళ్ల యువతి అదే ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేటు కాలేజీలో రిసెప్షనిస్టుగా పని చేస్తుంది. ఈ యువతికి నాచారంకు చెందిన మజీద్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత వారిద్దరూ మరింతగా దగ్గరయ్యారు. దీంతో ఆ యువకుడు ప్రియురాలిని తన ఇంటికి తీసుకెళ్లి శారీరక సుఖం పొందుతూ వచ్చారు. ఆ సమయంలో వీడియోలు, ఫోటోలు కూడా తీసి తన వద్ద ఉంచుకున్నాడు. 
 
నెలలు గడుస్తున్నప్పటికీ పెళ్లిమాటెత్తకుండా శారీరకంగానే కలుసుకుంటూ వచ్చారు. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని ఆ యువతి మజీద్‌ను నిలదీసింది. దీంతో పెళ్లి మాటెత్తితే తనవద్ద ఉన్న వీడియోలు, ఫోటోలు ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేస్తానని హెచ్చరించాడు. 
 
అయితే, ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించడంతో మాట్లాడుకుందామని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ సమయంలో అతని తల్లి కూడా ఇంట్లోనే ఉన్నది. అయినప్పటికీ ఆ యువతిపై మజీద్ లైంగికదాడికి చేసి ఆమె వద్ద ఉన్న బంగారం నగలు, డబ్బు తీసుకుని బయటకు గెంటేశాడు. దీంతో బాధిత యువతి నేరుగా స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి ఆ కామాంధుడుని అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం