ఇద్దరు యువతులు.. తాళికట్టుకుని ఒక్కటయ్యారు.. చూసినవారంతా షాక్?

సోమవారం, 3 జూన్ 2019 (17:34 IST)
స్వలింగ సంపర్కంపై ఆకర్షితులైన ఇద్దరు యువతులు తాళి కట్టుకుని ఒక్కటయ్యారు. ఈ ఘటన తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విల్లుపురం జిల్లా, తిరుకోవిలూరులోని ఉళగలంద పెరుమాల్ ఆలయంలో శనివారం సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో ఇద్దరు యువతుల్లో ఓ యువతి ఇంకో బాలిక మెడలో తాళి కట్టింది. ఇంకా మెట్టెలు కూడా వేసింది. 
 
దీన్ని చూసిన అక్కడున్న భక్తులంతా షాక్ అయ్యారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఆలయానికి చేరుకుని.. బాలికల వద్ద జరిపిన విచారణలో.. వారిద్దరూ స్వలింగ సంపర్కులని తెలియవచ్చింది. 
 
ఒకే పాఠశాలలో చదివిన వీరిద్దరూ ప్లస్ టూ పాసయ్యారు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇందుకోసం ఇంటి నుంచి పారిపోయి.. ఆలయంలో పెళ్లి చేసుకున్నారని తెలిసింది. దీంతో పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. తల్లిదండ్రులకు రప్పించి.. వారి వారి ఇళ్లకు పంపారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం రాజకీయాలకు గుడ్‌బై.. జగన్ మావాడేనంటున్న జేసీ